- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 1st ODI: Virat Kohli Equals Kiwis player Ross Taylor's catch record and becomes 4th Player to achieve this in ODI Cricket
Virat Kohli: రాస్ టేలర్ రికార్డ్‌ని ‘క్యాచ్’ పట్టేసిన కోహ్లీ.. బ్యాట్ పట్టకుండానే వన్డే చరిత్రలో నాల్గో ప్లేయర్‌గా..
IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాకుండానే అరుదైన ఘనత సాధించాడు. దీంతో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన ఆ ఘనత ఏమిటంటే..?
Updated on: Jul 28, 2023 | 9:38 PM

Virat Kohli: భారత్-వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేయలేదు. అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. భారత్ 5 వికెట్లు కోల్పోయినా కోహ్లీకి బ్యాటింగ్ అవకాశం రాకపోవడం ఇదే తొలి సారి కావచ్చు.

అయితే బ్యాటింగ్‌కి దిగకుండానే కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. మ్యాచ్‌లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రాస్ టేలర్ రికార్డ్‌ని కోహ్లీ సమం చేయడమే కాక, వన్డే చరిత్రలో టాప్ 4 లిస్టులోకి ప్రవేశించాడు.

అదేలా అంటే.. రవీంద్ర జడేజా వేసిన 18వ ఓవర్‌లో రొమరియో షెఫర్డ్ ఇచ్చిన క్యాచ్ పట్టుకున్నాడు కోహ్లీ. ఇది కోహ్లీకి తన వన్డే కెరీర్‌లో 142వ క్యాచ్. అంతే.. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 4వ ఆటగాడిగా కోహ్లీ అవతరించాడు.

అలాగే కోహ్లీ తన కంటే ముందే 142 క్యాచ్‌లతో అత్యధిక వన్డే క్యాచ్‌లు పట్టి నాల్గో స్థానంలో కొనసాగుతున్న రాస్ టేలర్ రికార్డ్‌ని సమం చేశాడు. రాస్ టేలర్ 236 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీ 275 మ్యాచ్‌ల్లో టేలర్ రికార్డ్‌ని సమం చేశాడు.

కాగా, వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే 448 మ్యాచ్‌ల్లో 218 క్యాచ్‌లు పట్టుకున్నాడు.

160 వన్డే క్యాచ్‌లు పట్టిన రికీ పాంటింగ్(375 మ్యాచ్‌లు) రెండో స్థానంలో.. 156 క్యాచ్‌లతో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(334 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నారు.





























