AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మున్సిపల్‌ కార్మికులను వరించిన అదృష్టం.. 11 మంది కలిసికొన్న టికెట్‌కు రూ.10కోట్ల జాక్‌పాట్‌..!

అందరూ కలిసి డబ్బులు పోగేసి రూ.250 విలువ చేసే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వారిలో తొమ్మిది మంది తలో రూ.25 ఇచ్చారు. మరో ఇద్దరు రూ12.50 వేసుకుని..రూ.250తో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశారు. అలా మున్సిపల్‌ కార్మికులైన మహిళలంతా కలిసి డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది.

మున్సిపల్‌ కార్మికులను వరించిన అదృష్టం.. 11 మంది కలిసికొన్న టికెట్‌కు రూ.10కోట్ల జాక్‌పాట్‌..!
Money
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2023 | 2:23 PM

Share

కేరళకు చెందిన పదకొండు మంది మహిళ కార్మికులకు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారందరూ కలిసి కేవలం రూ.250లతో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దాంతో ఆ 11మంది మహిళలు రాత్రికిరాత్రే లక్షాధికారులైపోయారు. ఇక ఈ 250 రూపాయల లాటరీ టికెట్ కోసం 11 మంది మహిళలు డబ్బులు పోగేసి మరీ కొనుగోలు చేశారు. చివరికి వారికి అదృష్టం కలిసి రావడంతో రూ.10 కోట్లు గెలుచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మలప్పురం పరిధిలోని పరప్పనంగడి మున్సిపాలిటీ కి చెందిన హరిత కర్మ సేనకు చెందిన కొందరు పేద మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌‌కు తరలిస్తుంటారు. అలా వచ్చే ఆ కొద్ది పాటి ఆదాయమే వారికి జీవనాధారం. ఈ క్రమంలోనే వారు లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని మార్చుకోవాలనుకున్నారు. కానీ, లాటరీ టికెట్ కొనుగోలు చేసే స్తోమత కూడా వారికి లేకపోవడంతో..అందరూ కలిసి డబ్బులు పోగేసి రూ.250 విలువ చేసే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వారిలో తొమ్మిది మంది తలో రూ.25 ఇచ్చారు. మరో ఇద్దరు రూ12.50 వేసుకుని..రూ.250తో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశారు.

అలా మున్సిపల్‌ కార్మికులైన మహిళలంతా కలిసి డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు వారు నిర్వహించిన డ్రాలో రూ.10 కోట్ల విలువ చేసే మాన్‌సూన్ బంపర్ లాటరీ తగిలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?