Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘అదే డౌట్‌గా ఉంది’.. పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్..

‘దగ్గుబాటి పురంధరేశ్వరి ఏ పార్టీకి అధ్యక్షురాలు? ఆమె బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీకి అధ్యక్షురాలా? ఇదే డౌట్‌గా ఉంది.’ అంటూ మంత్రి ఆర్కే రోజా అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక క్రీడాకారులు రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రమంతా పండుగ..

Andhra Pradesh: ‘అదే డౌట్‌గా ఉంది’.. పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్..
AP Minister RK Roja (File Photo)
Follow us
Raju M P R

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 29, 2023 | 3:57 PM

‘దగ్గుబాటి పురందేశ్వరి ఏ పార్టీకి అధ్యక్షురాలు? ఆమె బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీకి అధ్యక్షురాలా? ఇదే డౌట్‌గా ఉంది.’ అంటూ మంత్రి ఆర్కే రోజా అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక క్రీడాకారులు రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రమంతా పండుగ జరుగబోతోందన్నారు.

ఇదే సమయంలో ఇటీవల బీజేపీ అధ్యక్షురాలి నియామకం అయిన పురందేశ్వరిపై విమర్శలు గుప్పించారు. ఆమె తీరును తప్పుపట్టారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? టీడీపీకి అధ్యక్షురాలా? అన్న డౌట్ వస్తోందన్నారు. రాష్ట్ర చేసిన అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నది తప్పా? లేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి చెబుతున్నది అబద్దమా? అనేది క్లారిటీ ఇవ్వాలన్నారు. చంద్రబాబు చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువ అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని గుర్తు చేశారు రోజా. చంద్రబాబును సీఎం చేయాలన్న ఆలోచనలో పురందేశ్వరి ఉన్నారని విమర్శించారు. బాబు మాదిరిగానే ఆమె కూడా అబద్దాలు చెబుతోందని విమర్శించారు మంత్రి రోజా. ఇకనైనా పురందేశ్వరి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు చెప్పారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావలసిన వాటి కోసం, ప్రత్యేక హోదా కోసం పురందేశ్వరి పోరాడితే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారన్నారు.

అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ గుర్తుకురాని చంద్రబాబు.. ఇప్పుడు నదులు అనుసంధానం అంటూ లెక్చరర్ లా పాటలు చెప్తున్నారని దుయ్యబట్టారు మంత్రి రోజా. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్నపుడు నదుల అనుసంధానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు మంత్రి. ఇక 9 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. తన పార్టీని ప్యాకేజీ పార్టీగా మార్చేశారని సెటైర్లు వేశారు మంత్రి రోజా. వాళ్లకి, వీళ్లకు ఓటు వేయమని చెప్పడం తప్ప పోటీ చేసిందే లేదని ఎద్దేవా చేశారు. ఆయన సమయం అంతా చంద్రబాబుకు ఓటు వేయమని చెప్పడానికే సరిపోతోందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..