పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన భర్త.. బిచ్చగాడిలా కనిపించాడు.. ఆ భార్య చేసిన పనికి..
2020 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కూడా ఇదే విధమైన కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ రోడ్డు పక్కన బిచ్చగాడిని చూసి స్థానిక DSP ఆశ్చర్యపోయాడు. ఆ బిచ్చగాడు తన బ్యాచ్‌కి చెందిన అధికారి అని తేలిసి ఆవేదనకు గురయ్యాడు. మనీష్ మిశ్రా 2005 వరకు పోలీస్‌లో పనిచేశాడు. అతను చివరిసారిగా దతియా జిల్లాలో నియమించబడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. యూపీకి చెందిన ఈ వార్త ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా నిలిచింది. ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నగరంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆసుపత్రి వెలుపల ఆమె ఒక మానసిక వికలాంగుడిని చూసింది. అతడు గతం మర్చిపోయినట్టుగా ఉన్నాడు.. నేలపై కూర్చుని కనిపించాడు.. అతన్ని చూసిన ఆమెకు ఏదో తెలియని కలవరం కలిగింది. అతన్ని ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది…వెంటనే అతని దగ్గరికి వెళ్లి చూడగా.. అతడు ఆమెకు తాళికట్టిన భర్త అని తేలింది.10 సంవత్సరాల క్రితం తప్పిన తన భర్తను ఇలాంటి దీనస్థితిలో చూసిన ఆమె చలించిపోయింది.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తన భర్తను హత్తుకుని బోరున ఏడ్చేసింది. అమాయకంగా చూస్తున్న అతడిని చంటి పిల్లాడిలా లాలించడం ప్రారంభించింది.
మానసికంగా కుంగిపోయిన ఆ వ్యక్తి పిచ్చిగా కనిపించే జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగిపోయింది. మురికి బట్టలతో నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి ముందు కూర్చొని ఏడుస్తున్న ఆమెను చూసి ఆస్పత్రి బయట జనం గుమిగూడారు. అతడి జుట్టు దువ్వుకుంటూ, శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఏడుస్తున్న ఆమెను స్థానికులు ఓదార్చే ప్రయత్నం చేశారు.. అసలు విషయం ఏంటని ఆరా తీయగా.. ఆమె జరిగిన విషయం వివరించింది.
ఆస్పత్రి ఎదుట కనిపించిన బిచ్చగాడు.. తన భర్తేనంటూ చెప్పింది. పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన భర్త ఇలాంటి దీనస్థితిలో కనిపించటంతో ఆమె కుంగిపోయింది.. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎందుకు వెళ్లిపోయావు? అంటూ అతన్ని నిలదీస్తూ విలపించింది. కానీ, అతడు ఏమీ మాట్లాడలేదు..మౌనంగానే ఆమెను చూస్తూ కూర్చున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మహిళ తన మొబైల్ తీసి ఇంట్లో ఉన్న పిల్లలకు ఫోన్ చేసి విషయం చెప్పింది.. అతన్ని బైక్ ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం, ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, సామాజిక కార్యకర్తలతో సహా ఇతర వ్యక్తులు ఆ మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. బాధిత మహిళ భర్తకు ఏదో ఒక విధంగా సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు.
2020 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కూడా ఇదే విధమైన కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ రోడ్డు పక్కన బిచ్చగాడిని చూసి స్థానిక DSP ఆశ్చర్యపోయాడు. ఆ బిచ్చగాడు తన బ్యాచ్‌కి చెందిన అధికారి అని తేలిసి ఆవేదనకు గురయ్యాడు. గ్వాలియర్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత DSP రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ సింగ్ భదౌరియా ఝాన్సీ రోడ్డు నుండి బయలుదేరారు. వారిద్దరూ బంధన్ వాటిక కాలిబాట గుండా వెళ్ళగానే, అక్కడ ఒక మధ్య వయస్కుడైన బిచ్చగాడు చలికి చలించిపోతున్నాడు. అతడిని చూసిన అధికారులు కారు ఆపి అతనితో మాట్లాడేందుకు వెళ్లారు.
ఆ తర్వాత ఇద్దరు అధికారులు అతనికి సహకరించారు. రత్నేష్ షూస్ ఇచ్చాడు. డిఎస్పీ విజయ్ సింగ్ భదౌరియా జాకెట్ ఇచ్చాడు. అనంతరం ఇద్దరూ మాట్లాడుకోవడంతో అవాక్కయ్యారు. ఆ బిచ్చగాడు డీఎస్పీ బ్యాచ్ అధికారి మనీష్ మిశ్రా అని తేలింది. మనీష్ మిశ్రా గత పదేళ్లుగా దిక్కుతోచని పరిస్థితుల్లో బిచ్చగాడిగా తిరుగుతున్నాడు.
మనీష్ మిశ్రా 2005 వరకు పోలీస్‌లో పనిచేశాడు. అతను చివరిసారిగా దతియా జిల్లాలో నియమించబడ్డాడు. క్రమంగా, అకస్మాత్తుగా అతని మానసిక స్థితి క్షీణించింది. కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన మొదలైంది. మనీష్‌ను చికిత్స నిమిత్తం ఎక్కడికి తీసుకెళ్లినా పారిపోయేవాడు. కొద్దిరోజుల తర్వాత మనీష్ ఎక్కడికి వెళ్లాడో కుటుంబసభ్యులు కూడా కనిపెట్టలేకపోయారు. అతని భార్య కూడా అతన్ని విడిచిపెట్టింది. తర్వాత భార్య విడాకులు తీసుకుంది.దాంతో అతడు మెల్లగా అడుక్కోవడం మొదలుపెట్టాడు. దాదాపు పదేళ్లు భిక్షాటనతో గడిచిపోయాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..