Andhra Pradesh: ‘మేకుల బాబా’.. వీడు మామూలోడు కాదు.. నాలుగు దిక్కుల్లో మేకులు కొడతాడు.. సీన్ కట్ చేస్తే..
నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకుల బాబా అంటే.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
విజయవాడ, ఆగస్టు 19: నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకుల బాబా అంటే.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ బాబా మోసం ఘటన తాజాగా విజయవాడలో కలకలం రేపింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. తిరిగి అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో ఓ మహిళ మౌలాల అనే బాబాను రజనీకి పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. 100 గంజాలు అమ్ముడుపోయేలా చేసి 4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని బెదిరించాడు. వెధింపులు పెరగడంతో ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది.
రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని 35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. అంత డబ్బు పెట్టి కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను ఓ భక్తురాలు రజనీకి పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెకుల బాబా.. నమ్మించి మోసం చేసిన ఘటన ఇప్పుడు బెజవాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. తన దగ్గర రూ.రెండున్నర లక్షల వరకు తీసుకుని బాబా పూజలు చేసినట్లు బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..