AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొదటి అడుగు వేయడానికి కష్టపడుతున్న పిల్ల ఏనుగు.. బిడ్డకు నడక నేర్పుతున్న తల్లి.. వీడియో చూడాల్సిందే…

ల్ల ఏనుగులను చూడటం ఆనందకరమైన అనుభవం. నిద్రపోతున్నా, స్నానం చేసినా, తిన్నా, ఆడుకుంటున్నా.. ఒక్క చోట ఆగకుండా అక్కడక్కడా పరిగెడుతూ ఉండే పిల్ల ఏనుగులను చూడటం నిజంగా అద్భుత దృశ్యమే. కానీ ఈ పిల్ల ఏనుగు నేలపై లేచి నిలబడి మళ్లీ పడిపోతుంది. తర్వాత మళ్లీ మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది..

Viral Video: మొదటి అడుగు వేయడానికి కష్టపడుతున్న పిల్ల ఏనుగు.. బిడ్డకు నడక నేర్పుతున్న తల్లి.. వీడియో చూడాల్సిందే...
New Born Calf To Walk
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2023 | 11:51 AM

Share

ఏనుగులు చాలా తెలివైన జంతువులు. మనుషుల్లాగే తమ కుటుంబాన్ని కాపాడుకుంటాయి. కొన్నిసార్లు అవి తమ వారి కోసం పోరాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటాయి.. ఆడ ఏనుగు కూడా తన పిల్లలను మానవ తల్లిలా చూసుకుంటుంది. తల్లి ఏనుగు తన నవజాత శిశువుకు నిలబడటం నేర్పిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రపంచంలో ఎంత పెద్ద బిడ్డ అయినా మొదటి అడుగు వేయడానికి సహాయం చేసేది తల్లి అని దీన్ని బట్టి తెలుస్తుంది! YouTube ఛానెల్ ఇలాంటి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలను తరచుగా షేర్‌ చేస్తుంటుంది. ఇటీవల ఏనుగు తన బిడ్డకు నిలబడటం, నడవడం నేర్పుతున్న వీడియో ఈ ఛానెల్‌లో షేర్ చేయగా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. జంగిల్ గైడ్ కూడా అయిన బ్రెట్ సఫారీలో ఉన్నప్పుడు ఈ వీడియోను రికార్డ్ చేశాడు. కెన్యా అడవుల నుండి వీడియోలు తరచుగా ఈ ఛానెల్‌లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి వీడియో కెన్యాకు చెందినదిగా తెలుస్తోంది. అయితే, ఈ వీడియో ఎక్కడిది అన్న విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

అప్పుడే పుట్టిన పాపకు తల్లి ఏనుగు సాయం చేస్తున్న వీడియో..

ఓ ఆడ ఏనుగు అప్పుడే బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ పుట్టిన శిశువు తన కాళ్ళపై నిలబడలేకపోతుంది. జంతువులు పుట్టిన వెంటనే వాటి కాళ్లపై నిలబడతాయి. కానీ ఈ పిల్ల ఏనుగు నేలపై లేచి నిలబడి మళ్లీ పడిపోతుంది. తర్వాత మళ్లీ మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది.. కానీ,లేవలేక చాలా కష్టపడుతుంది. అది చూసిన దాని తల్లి కలత చెందుతుంది. పిల్ల వద్దకు పరుగెత్తుతుంది. సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. తల్లి ఏనుగు తన ట్రంక్‌తో పిల్లను ఎత్తడానికి ప్రయత్నిస్తుంది. బిడ్డను తన కాళ్లపై నిలబెట్టడానికి చాలా కష్టపడుతుంది. చివరికి.. ఆ పిల్ల ఏనుగు ఎలాగోల ఎటువంటి మద్దతు లేకుండా స్వయంగా లేచి నిలబడుతుంది.

ఏనుగు వీడియోకు 22 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రకృతిలో ఇలాంటి క్షణాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని ఒకరు అన్నారు. ఇది చాలా అందమైన దృశ్యం అని ఒకరు..ఇది చూసి తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయని మరొకరు చెప్పారు. దీన్ని రికార్డ్ చేసినందుకు ధన్యవాదాలు, వీడియో తన హృదయాన్ని తాకిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఏనుగులు, కోతులు, డాల్ఫిన్లు ఇతర వాటిలా కాకుండా అనూహ్యంగా తెలివైన జీవులని జంతు పరిశోధకులు అంటున్నారు. ఏనుగులు మనలాగే ఆలోచనలు, లోతైన భావాలు భావోద్వేగాలను అనుభవించగలవు. పిల్ల ఏనుగులను చూడటం ఆనందకరమైన అనుభవం. నిద్రపోతున్నా, స్నానం చేసినా, తిన్నా, ఆడుకుంటున్నా.. ఒక్క చోట ఆగకుండా అక్కడక్కడా పరిగెడుతూ ఉండే పిల్ల ఏనుగులను చూడటం నిజంగా అద్భుత దృశ్యమే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..