చైనాలో HMPV.. అమెరికాలో ‘రాబిట్ ఫీవర్’..! దడపుట్టిస్తున్న వైరస్‌.. ఈ వింత వ్యాధి ఏంటో తెలుసా?

2000లో మసాచుసెట్స్ వైన్యార్డ్‌లో ఈ ఇన్ఫెక్షన్ మోడ్ మొదటిసారి కనిపించింది. ఇక్కడ తులరేమియా వ్యాప్తి ఆరు నెలల పాటు కొనసాగింది. దీని కారణంగా 15 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. తాజాగా మరోసారి అమెరికాలో రాబిట్ ఫీవర్ సోకిన కేసులు నమోదవుతున్నట్లు సీడీసీ వెల్లడించింది.

చైనాలో HMPV.. అమెరికాలో 'రాబిట్ ఫీవర్'..! దడపుట్టిస్తున్న వైరస్‌.. ఈ వింత వ్యాధి ఏంటో తెలుసా?
Rabbit Fever
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2025 | 8:25 PM

ఒక వైపు, చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వేగంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దేశం వెలుపల కూడా దాని కేసులు కనిపించడం ప్రారంభించాయి. మరోవైపు, అమెరికాలో తులరేమియా కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. చాలా అరుదైన ‘రాబిట్ ఫీవర్’ వ్యాధి ప్రస్తుతం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. గత 10 సంవత్సరాలలో అమెరికాలో ‘రాబిట్ ఫీవర్’ (తులరేమియా) కేసులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. ‘రాబిట్ ఫీవర్’ అనేది ఫ్రాన్సిసెల్లా టులరెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ‘రాబిట్ ఫీవర్’ గురించి అతిపెద్ద ప్రశ్న అది ఎలా వ్యాపిస్తుంది..?

‘రాబిట్ ఫీవర్’ ఎలా వ్యాపిస్తుంది?

సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం, ఈ వ్యాధి మానవులలో వివిధ మార్గాల్లో వ్యాపిస్తుంది. ఇది వైరస్ సోకిన జింక, ఈగలు, కుందేళ్ళు, ఎలుకలు వంటి జంతువులతో నేరుగా చర్మాన్ని తాకడం ద్వారా వ్యాపిస్తుంది. అంతే కాదు, కొన్నిసార్లు వ్యాధి సోకిన జంతువుల గూళ్ళపై బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి గడ్డి ద్వారా కూడా సంక్రమిస్తుంది. దీని వల్ల తెలియకుండా గడ్డి కోసే వ్యక్తికి కూడా వ్యాధి సోకుతుంది. ‘రాబిట్ ఫీవర్’ కేసులలో సాధారణంగా 5 నుండి 9 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, 65 నుండి 84 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ఇది ఎక్కువగా మధ్య అమెరికా రాష్ట్రాల్లో నివసిస్తున్న వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న యూఎస్‌కు చెందిన CDC సమర్పించిన నివేదికలో పేర్కొంది.

2000లో మసాచుసెట్స్ వైన్యార్డ్‌లో ఈ ఇన్ఫెక్షన్ మోడ్ మొదటిసారి కనిపించింది. ఇక్కడ తులరేమియా వ్యాప్తి ఆరు నెలల పాటు కొనసాగింది. దీని కారణంగా 15 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. అదేవిధంగా, 2014-2015 మధ్యకాలంలో కొలరాడోలో ఈ కేసులు కనిపించాయి. అనేక కేసుల్లో గడ్డి కోత వల్ల మానవులకు సంక్రమించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. CDC ఈ కేసులను నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే చికిత్స లేకుండా అవి ప్రాణాంతకం కావచ్చు. CDC నివేదికల ప్రకారం, ‘రాబిట్ ఫీవర్’ కేసుల్లో మరణాల రేటు సాధారణంగా రెండు శాతం కంటే తక్కువగా ఉంటుంది. అయితే, బ్యాక్టీరియా జాతిని బట్టి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు.

47 రాష్ట్రాల్లో 2,462 కేసులు నమోదు..!

అమెరికాలో నమోదవుతున్న కేసుల విషయానికి వస్తే, 2011 – 2022 మధ్య, 47 రాష్ట్రాల్లో 2,462 కేసులు నమోదయ్యాయి. సంవత్సరానికి సుమారు 1.35 మిలియన్ల సాల్మొనెల్లా విషప్రయోగం సంభవిస్తుందని సీడీసీ పేర్కొంది. వాటిలో అరుదైన కేసు ఏమిటంటే, 2 లక్షల మందిలో ఒక కేసు మాత్రమే నమోదైంది. అయితే 2001 – 2010 మధ్య నమోదైన కేసులలో 56 శాతం పెరుగుదల కనిపించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..