కోమాలో ఉన్న వ్యక్తి మనస్సులో ఏం జరుగుతుంది?

TV9 Telugu

27 December 2024

ఉక్రెయిన్ చాలా శక్తివంతమైన క్షిపణిని తయారుచేసింది. ఇది రష్యాను నాశనం చేయగలదంటున్నారు నిపుణులు. ట్రెంబిటా క్షిపణిని సిద్ధం చేసింది.

ఈ క్షిపణి పొడవు 8 అడుగులు. దీని బరువు 100 కిలోలు. 20 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం ఉందని ఉక్రెయిన్ పేర్కొంది.

ట్రెంబిటా వేగం గంటకు 400 కిలోమీటర్లు.  ఈ క్షిపణి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

ఈ క్షిపణిలో ఉక్రెయిన్ పల్స్ జెట్ ఇంజన్‌ను ఉపయోగించినట్లు దీన్ని తాయారు చేసిన అధికారులు పేర్కొన్నారు.

ఇది ప్రపంచ యుద్ధం-2లో ఉపయోగించిన జర్మనీకి చెందిన V-1 ఫ్లయింగ్ బాంబ్ క్షిపణికి కాపీ అని అంటున్నారు నిపుణులు.

జర్మనీ 1939 సంవత్సరంలో V-1 ఫ్లయింగ్ బాంబును సిద్ధం చేసింది. కానీ ఆ తరువాత దేశం ఈ క్షిపణిని నిలిపివేసింది.

ఈ రెండు క్షిపణుల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ట్రెంబిటా క్షిపణి వేగం గంటకు 400 కిలోమీటర్లు. కాగా జర్మనీ ఎగిరే బాంబు వేగం గంటకు 650 కిలోమీటర్లు.

జర్మనీ క్షిపణి పరిధి 250 కి.మీ. కాగా, ట్రెంబిటా పరిధి 700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పల్స్ జెట్ ఇంజన్లు రెండింటిలోనూ ఉపయోగించారు.