Bird Flu: అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. కలకలం రేపుతోన్న వైరస్

అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం చోటు చేసుకుంది. డిసెంబర్ నెలలో ఆస్పత్రిలో చేరిన వృద్దుడు.. చికిత్స పొందుతూ మరణించాడు. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస కోశ సమస్యతో డిసెంబరు నెల మధ్యలో అతడు ఆస్పత్రిలో చేరాడు.

Bird Flu: అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం.. కలకలం రేపుతోన్న వైరస్
Bird Flu
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2025 | 12:12 PM

చలికాలం ప్రభావం చూపుతోంది. వివిధ రకాల వైరస్‌లు మానవాళిపై పంజా విసురుతున్నాయి. ఓవైపు చైనాలో కొత్తగా మొదలైన హెచ్‌ఎంపీవీ వైరస్‌.. నెమ్మదిగా ప్రపంచదేశాలవైపు పయనిస్తోంది. ఆందోళన అవసరం లేదని అధికారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనూ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది హెచ్‌ఎంపీవీ వైరస్‌. కరోనా లక్షణాలతో మానవాళికి మరోసారి మాస్క్‌ అవసరాన్ని గుర్తుచేస్తోంది. తాజాగా అమెరికాలో బర్డ్‌ ఫ్లూ పడగవిప్పుతోంది. ఇప్పటి వరకూ పక్షులు, కోళ్లు, జంతువుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్‌ తొలిసారి మనుషుల్లో కనిపించింది. అమెరికాలో బర్డ్‌ ఫ్లూతో తొలిమరణ నమోదయింది.

మనుషుల్లో తొలి బర్డ్‌ ఫ్లూ H5N1 మరణం అమెరికాలో నమోదైంది. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు పలు ఇతర సమస్యలతో డిసెంబరు నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. పెరట్లో ఉన్న అడవి పక్షులు, మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారినపడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి