Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 8, 2025): మేష రాశి వారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఏదో ఒక మార్గంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 8, 2025): మేష రాశి వారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఏదో ఒక మార్గంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం బాగానే పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా పురోగతి ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాల్లో లబ్ధి పొందుతారు. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. అనుకోకుండా పిత్రార్జితం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఏదో ఒక మార్గంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కు వగానే ఉంటుంది. కొన్ని చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కష్టార్జితంలో ఎక్కువ భాగం కుటుంబ ఖర్చులకు సరిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో మాట తొందరపాటు వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలున్నా, సహోద్యోగుల నుంచి సమస్యలుం టాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యో గాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యో గం లభించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వివాదాల్లో సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో కల్పించుకోవద్దు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఇంటా బయటా పని భారం, బాధ్యతల బరువు ఎక్కువగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. వ్యక్తిగత సమ స్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభి స్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష)
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ మరింతగా పెంచడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పోవడం కూడా మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభం కలుగు తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల్లో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సవ్యంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరు ద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల వల్ల నష్టపోతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో కొద్దిపాటి పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవ హరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థి కంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.