Astrology: కీలక గ్రహాల అనుకూలత.. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే రాశులివే!

కొన్ని కీలక గ్రహాల అనుకూలత కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారు జీవితంలో కొత్త ఎత్తులకు చేరే అవకాశముంది. ఎవరైనా వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే గ్రహాల అనుకూలత కూడా చాలా ముఖ్యమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే కొన్ని రాశుల వారు జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Astrology: కీలక గ్రహాల అనుకూలత.. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే రాశులివే!
Telugu Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 07, 2025 | 7:53 PM

ఈ ఏడాది గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశుల వారు టాప్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలన్న పక్షంలో గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. ముఖ్యంగా శని, గురువు, రాహుకేతువులు అనుకూల రాశుల్లోకి మారడం, మిగిలిన గ్రహాలు కూడా కొద్దో గొప్పో సరైన రాశుల్లో సంచారం చేయడం అవసరం. శనీశ్వరుడు మార్చి 29న మీన రాశిలోకి, గురువు మే 25న మిథున రాశిలోకి, రాహుకేతువులు మే 18న వరుసగా కుంభ, సింహరాశుల్లోకి మారడం జరుగుతోంది. అందువల్ల ఈ ఏడాది జూన్ 1 నుంచి ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. ఈ ఆరు నెలల్లో ఉన్నత స్థానాలకు వెళ్లగలిగిన రాశులు మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, కుంభం.

  1. మేషం: ఈ రాశివారు గురు, శుక్ర, బుధ, రాహువుల అనుకూలత కారణంగా కొద్ది ప్రయత్నంతో అంద లాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ రాశివారు తమ సమర్థతను, నైపుణ్యాలను మరింతగా మెరుగు పరచుకుని, ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు కలుగుతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి గురు, శుక్రులతో పాటు శనీశ్వరుడు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా మారు తున్నందువల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తమ సమర్థతను నిరూపించుకుని ఉన్నత పదవులు అందుకుంటారు. షేర్లు, స్టాకులు, స్పెక్యులేషర్ల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఆదాయ వృద్ధి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటపట్టే అవకాశం ఉంది. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది.
  3. తుల: ఈ రాశికి గురు, శనులు అనుకూల స్థానాల్లో సంచారం చేయబోతున్నందువల్ల జూన్ నుంచి ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనేక శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతం అవు తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి గురు, రాహు, శుక్రులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించి మానసిక ప్రశాంతత కలు గుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్ లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.
  5. మకరం: ఈ రాశి వారి మీద శని, శుక్ర, గురువులు కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. మార్చి తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు మరింత మంచి సంస్థలోకి, పైగా ఉన్నత పదవిలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యో గులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
  6. కుంభం: ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గిపోవడంతో పాటు, గురు, బుధ, కుజుల అనుకూలతలు పెరుగుతున్నందువల్ల సాధారణ వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సామాజి కంగా మంచి గుర్తింపు లభిస్తుంది. లాభదాయక వ్యవహారాలను చేపడతారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.