పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

Phani CH

|

Updated on: Jan 09, 2025 | 3:42 PM

ఆదాయానికి తగట్టుగా ఖర్చు చేయడం.. ఉన్న దాంట్లో కాస్త విలాసవంతంగా జీవించడం అందరూ చేసేదే. ఇక కోటీశ్వరులైతే ఆ లగ్జరీ అందరికీ కనిపిస్తుంది. కానీ దీనికి రివర్స్ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆడంబర జీవితాన్ని పక్కనపెట్టి, తక్కువ ఖర్చుతో రోజును గడిపేస్తున్న సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారి స్టోరీనే ఇది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. షాంగ్ సావెడ్రా ఒక వ్యాపారవేత్త.

హార్వర్డ్‌లో చదువుకున్నారు. పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన షాంగ్‌ దంపతులు మల్టీ మిలియనీర్లు. కానీ వారి లైఫ్‌స్టైల్ చూస్తే.. వారికి అంత ఆస్తి ఉందని ఎవరూ అనుకోరు. నాలుగు పడకల గదులున్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం నాటి కారునే వాడుతున్నారు. పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు, ఫేస్‌బుక్‌ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మలే ఇస్తున్నారు. అయితే పిల్లల చదువు, పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలకు మాత్రం డబ్బు ఖర్చు చేస్తున్నారు. తమకు కూడా విలాసవంతంగా జీవించాలని అనిపిస్తూనే ఉంటుందన్నారు వీళ్లు. అయితే చిన్నప్పటి నుంచి అలా ఎంజాయ్ చేయలేదన్న భావన నుంచి వచ్చిన ఫీలింగే తప్ప దాంట్లో ఏమీ లేదని తాము అర్థం చేసుకున్నామన్నారు. తమ ఆలోచనలను ఎలా అదుపు చేసుకుంటారో కూడా చెప్పేశారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్‌లో ఆస్తులున్నాయి. అనీ కోలెది కూడా అదే స్టోరీ. ఆమె ఒక రీసెర్చర్‌. పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్. డబ్బును ఎలా మదుపు, పొదుపు చేయాలో మహిళలకు సూచనలు ఇస్తుంటారు. ఆమెకు ఒక మిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆస్తులున్నా కానీ, తనవద్దనున్న కారును అమ్మేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

Game Changer: చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ