సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే అరుదైన కోరల్స్ జాతికి చెందిన మొక్కలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఈ మొక్కలను ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలుగా పిలుస్తారు. సముద్ర గర్భంలో ఉండే ఈ మొక్కలకు ఆకర్షణ శక్తి ఉంటుందని నమ్ముతారు. సముద్రంలో తిరిగే కీటకాలను ఈ మొక్కలు ఆకర్షిస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత పగడాలుగా తయారవుతాయట.
అందుకే వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను నరదిష్టి తగలకుండా తాయిత్తుల తయారీకి వాడతారట. ఆర్ధిక బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ఫ్రేమ్స్ చేసి పెట్టుకుంటారు. దంపతుల మధ్య గొడవలు రాకుండా ఇంట్లోనూ పెట్టుకుంటారట. ఇవి ఇంట్లో ఉంటే ఎలాంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయని నమ్ముతారు. తాయత్తుగా చేసుకుని ధరిస్తే… వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, సంఘంలో గౌరవమర్యాదలు వస్తాయని, శత్రువులపై విజయాలు సాధిస్తారని, ఉద్యోగంలో రాణిస్తారని నమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో పశుపోషణ, వ్యవసాయం, భారీ యంత్రాలతో పనులు చేసేవాళ్లు వీటిని ఖచ్చితంగా ధరించాల్సిందేనని కూడా నమ్ముతుంటారట. సో అందుకే ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలకు మార్కెట్‌లో ఫుల్లు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
Game Changer: చరణ్ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే