Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఇవాళ కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యశ్ పుట్టిన రోజు. దీంతో అతనికి నలువైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అందరూ యశ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో ఆస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన సంపాదన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
పాన్ ఇండియా ఫేమస్ అయిన యశ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రకటనలతోనూ భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో భారీగానే ఆస్తులు కూడ బెట్టాడీ రాఖీ భాయ్. ఒక నివేదిక ప్రకారం ఏటా 6 నుంచి 7 కోట్లు సంపాదిస్తున్నాడు యశ్. అలా ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోకు మొత్తం సుమారు 53 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. యశ్ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తాడు. ఇందుకోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. యశ్ కు గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో రూ. 4 కోట్ల విలువైన ఇల్లు ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో దీనిని అందంగా అలంకరించాడు. ఇక యశ్ గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు ఉంది. ఇదే కాకుండా ఇంకో రెండు మూడు లగ్జరీ కార్లు కూడా ఈయన గ్యారేజ్లో ఉన్నాయి. వీటి విలువ కూడా భారీగానే ఉందని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: చరణ్ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు
Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం