శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

Phani CH

|

Updated on: Jan 09, 2025 | 2:05 PM

సంధ్య థియేటర తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 08న అల్లు అర్జున్ కూడా స్వయంగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆ బాలుడిని పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. అలాగే పిల్లాడి తండ్రికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.

ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తాజాగా మరో సారి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు కిమ్స్ డాక్టర్లు. పిల్లాడికి అందుతున్న చికిత్స గురించి మరిన్ని అప్డేట్స్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. చిన్నారి క్రమంగా కోలుకుంటున్నాడు. యాంటి బయోటిక్స్ కూడా ఆపేశాం. అంటూ శ్రీతేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ను చెప్పుకొచ్చారు కిమ్స్ డాక్టర్లు. కానీ ఇంకా వెంటిలేటర్‌పైనే శ్రీ తేజ్ కు చికిత్స కొనసాగుతోందని మెన్షన్ చేశారు. మరోవైపు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. త్వరగా కోలుకుని మునుపటిలా… చలాకీగా మారాలని ఆకాంక్షిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్