హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపార వేత్త బాబీ చెమ్మన్నూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నాడంటూ బాబీ చెమ్మన్నూర్‌పై హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నారు.
కొచ్చి నుంచి వయనాడ్ వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతనిని అదుపులోకి తీసుకుంది. తదుపరి విచారణ కోసం బాబీ చెమ్మన్నూర్‌ను కొచ్చికి తీసుకెళ్లనున్నారు. ఇక గత కొంత కాలంగా కొందరు తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నట్లు హనీ రోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాంటి వారిపై చట్టపరంగా పోరాడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇప్పుడు హనీ రోజ్ ఆరోపణలతో మరోసారి లైంగిక వేధింపులు వ్యవహారం తెర మీదకు వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
Game Changer: చరణ్ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు
Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం