విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

Phani CH

|

Updated on: Jan 09, 2025 | 2:57 PM

తమిళ్ స్టార్ హీరో విశాల్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న విశాల్..ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్‌కి వచ్చాడు. అయితే ఈ వేడుకలో విశాల్ ఊహించని లుక్‏లో కనిపించడంతో అభిమానులు షాకయ్యారు. పూర్తిగా బక్కగా మారిపోయి వణుకుతూ కనిపించారు. అలాగే మాట సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయారు.

కనీసం నిలబడేందుకు కూడా విశాల్ ఇబ్బంది పడడం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన టీమ్ చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విశాల్ ఆరోగ్యం గురించి రోజుకో వీడియో షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. విశాల్‏కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందన్నారు ఖుష్భూ. కానీ మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు విశాల్ వచ్చారన్నారు. ఆరోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారని.. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత అడియన్స్ ముందుకు వస్తుందని..అందుకే తాను కచ్చితంగా రావాలనుకున్నానని.. విశాల్ చెప్పాడన్నారు ఖుష్భూ. ఆ వేడుక రోజున విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉంది. అందుకే ఆయన వణికిపోయారని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్