హానీ రోజ్
దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అగ్ర కథానాయికలలో హానీ రోజ్ ఒకరు. 2005లో బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా మలయాళం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా సినీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మలయాళంతోపాటు కన్నడ, తెలుగు, తమిళం భాషలలో వరుసగా సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో తొలిసారిగా ఆలయం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దీంతో హానీకి తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హానీ రోజ్ కు మంచి పాపులారిటి వచ్చింది. వీరసింహా రెడ్డి సినిమా తర్వాత హానీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. కానీ వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో బిజీగా ఉంటుంది.