Honey Rose: హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు.. మహిళలందరి కోసం నా పోరాటం అంటూ..
తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్నట్లు నటి హనీరోజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు ఆలోచనలతో.. ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని వాపోయింది. చాలా మంది సెలబ్రిటీలతో పాటే గతంలో అతని బిజినెస్‌కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్లేదాన్ని అని హనీ రోజ్ తెలిపింది.
హనీరోజ్.. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ అందాల భామను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది ఈ బ్యూటీ. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా హనీరోజ్ నటించింది. ఈ అమ్మడి అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే హనీరోజ్ తాజాగా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హనీరోజ్ ఫిర్యాదుపై పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌పై అసభ్యకరమైన కామెంట్ చేశారని త ఫిర్యాదులో పేర్కొంది హనీ రోజ్. సోషల్‌మీడియాలో ఓ వ్యక్తి తనను అవమానిస్తున్నాడంటూ హనీ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
బ్యాడ్ కామెంట్స్ రావడంతో హనీ రోజ్ పోలీసులను ఆశ్రయించింది. హనీ రోజ్ స్క్రీన్‌షాట్‌లతో సహా కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరదా విమర్శలు, నా లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను నేనూ ఎంజాయ్ చేస్తాను.. వాటిని నేను యాక్సప్ట్ చేస్తా.. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ, వాటికీ ఓ హద్దు ఉంటుంది. అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించను. అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. నాకోసం మాత్రమే కాదు మహిళలందరి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నా అని హనీ రోజ్ పేర్కొంది.
“ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నాడు. నేను ఆ కామెంట్స్ చూసి పట్టించుకోకపోతే. నా ఫ్రెండ్స్ నువ్వు ఇలాంటివి స్వాగతిస్తున్నావా.? అని అడుగుతున్నారు. అతను ఓ బిజినస్ మ్యాన్. నన్ను ఒకేసారి ఎదో ఈవెంట్ కు పిలిచాడు. కానీ నేను వెళ్లడం కుదరలేదు. దాంతో అతను ఉద్దేశపూర్వకంగా నేను వెళ్ళే ఫంక్షన్లలో నా ఫోటోలపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు. వీలైన చోట మీడియాలో నా పేరును అవమానపరిచే విధంగా ప్రస్తావిస్తాడు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించాను అని తెలిపింది హనీ రోజ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.