Emergency Movie: ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

కంగనా రనౌత్ కథానాయికగా నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Emergency Movie: ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
Emergency Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2025 | 4:23 PM

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు మోక్షం కలిగింది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా జనవరి 17న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా మరో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. గతంలోనే ఒకసారి ఎమర్జెన్సీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ‘ఎమర్జెన్సీ’ సినిమాలో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి కంగనానే స్వయంగా దర్శకత్వం వహించింది. నిర్మాణంలో కూడా చేతులు కలిపింది. ఈ ట్రైలర్‌లో ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే నినాదం మరోసారి వినిపిస్తోంది. ట్రైలర్‌లో కంగనా నటన కూడా చాలా మందికి నచ్చింది. ఈ సినిమాతో కంగనాకు మళ్లీ జాతీయ అవార్డు వస్తుందని అభిమానులు ఊహించారు. అదే సమయంలో కొంతమంది మాత్రం కంగనా వాయిస్‌ని అసలు బాగోలేదంటూ విమర్శిస్తున్నారు. మరి జనాలు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారనేది చూడాలి.

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్‌తో పాటు శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, సతీష్ కౌశిక్, మిలింద్ సోమన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 1966లో ఇందిరాగాంధీ అధికారం చేపట్టినప్పటి నుంచి 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం, ఎమర్జెన్సీ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రాథమిక హక్కులపై తీసుకొచ్చిన నిర్ణయం ఇలా అన్నీ అంశాలను ఈ సినిమాలో కవర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నాడు. అలాగే అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్..

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.