AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hose Rose: హానీ రోజ్‏కు పెరుగుతున్న మద్దతు.. WCC సపోర్ట్.. అసలేం జరిగిందంటే..

మలయాళీ నటి హానీరోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్ 75 (4), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు హానీరోజ్ గురించి తాను ఎలాంటి చెడుగా ఏమీ మాట్లాడలేదని బాబీ వివరణ ఇచ్చాడు. తన మాటలతో హానీ రోజ్ ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు.

Hose Rose: హానీ రోజ్‏కు పెరుగుతున్న మద్దతు.. WCC సపోర్ట్.. అసలేం జరిగిందంటే..
Honey Rose
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2025 | 11:39 AM

Share

సోషల్ మీడియాలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇటీవల మలయాళీ నటి హానీరోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హానీరోజ్ వాంగ్మూలాన్ని కేరళ పోలీసులు తీసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు నటి హాన్ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) మద్దతు తెలిపింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ లో హానీరోజ్ ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు హనీరోజ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

హనీరోజ్ న్యాయ పోరాటాలకు పూర్తిగా మద్దతు ఇస్తామని.. అన్ని రకాల న్యాయ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అమ్మ సంఘం ప్రకటించింది. మరోవైపు హనీ రోజ్‌కి మద్దతుగా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) నిలిచింది. . “బి విత్ హర్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో హనీ రోజ్ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా డబ్ల్యుసిసి తన మద్దతును తెలిపింది. భారత న్యాయ వ్యవస్థ అనుమతించని ఎలాంటి దుస్తులు ధరించి ఆమె బహిరంగంగా కనిపించలేదని.. ప్రతి వ్యక్తి తమ సొంత ఆలోచనల ప్రకారం తమ సొంత చట్టపరమైన కోడ్‌లను రూపొందించుకోవడానికి ఆమె బాధ్యత వహించదని పేర్కొంటూ హనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నోట్‌ను WCC షేర్ చేసింది. .

ఒక నటిగా ఫంక్షన్లకు వెళ్లడం తన ఉద్యోగంలో భాగమని.. తన దుస్తులు లేదా తన గురించి వ్యక్తిగతంగా విమర్శించడం, జోక్స్ వేయడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ మనోభావాలు దెబ్బతినేలా.. వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపింది హనీరోజ్. సోషల్ మీడియాలో తనలాగే ఎంతో మంది మహిళలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

source :

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.