Yash Birthday: ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. రాకింగ్ స్టార్ మొత్తం ఆస్తులెంతో తెలుసా?
‘రామాయణం’ సినిమాకు గాను యశ్ 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. దీంతో భారతీయ సినిమా చరిత్రలో ఖరీదైన విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు రాఖీ భాయ్. అయితే ఈ చిత్రానికి యశ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు టాక్. రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడని తెలుస్తోంది.
కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యశ్ ఇవాళ (జనవరి 8) పుట్టిన రోజు జరుపకొంటున్నాడు . దీంతో అతనికి నలువైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అందరూ యశ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం యష్ విదేశాల్లో ఉన్నారు. తన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా యశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని టాక్సిక్ చిత్ర బృందం కూడా ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందించింది. ఒక సాధారణ బస్సు డ్రైవర్ కొడుకు అయిన యశ్ ఇప్పుడు సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ‘రాకింగ్ స్టార్’, ‘రాకీ భాయ్’ అన్న పేర్లతో కోట్లాది మంది అభిమానుల ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నాడు. కొంత మంది బాస్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. 2000లో యశ్ సీరియల్స్ ద్వారా మొదట ఈ సినిమా ఫీల్డ్ లోకి అడుగు పెట్టారు. వెండితెరకు పరిచయమై ‘మొగ్గిన మనసు’, ‘కిరాతక’, ‘రజులి’ వంటి సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. యశ నటించిక కేజీఎఫ్ 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కాగా పాన్ ఇండియా ఫేమస్ అయిన యశ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రకటనలతోనూ భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో భారీగానే ఆస్తులు కూడ బెట్టాడీ రాఖీ భాయ్. ఒక నివేదిక ప్రకారం ఏటా 6 నుంచి 7 కోట్లు సంపాదిస్తున్నాడు యశ్. అలా ఇప్పటివరకు ఈ స్టార్ హీరోకు మొత్తం సుమారు 53 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. యశ్ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తాడు. ఇందుకోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. యశ్ కు గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో రూ. 4 కోట్ల విలువైన ఇల్లు ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో దీనిని అందంగా అలంకరించాడు. ఇక యశ్ గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు ఉంది.
టాక్సిక్ సినిమాలో యశ్..
Havoc alert: 1 hour to go! 🔥#ToxicBirthdayPeek
– https://t.co/hs6OhzQyfp #TOXIC #TOXICTheMovie @TheNameIsYash #GeetuMohandas @KVNProductions #MonsterMindCreations @Toxic_themovie pic.twitter.com/XNxzRToU0M
— KVN Productions (@KvnProductions) January 8, 2025
యశ్ ట్యాక్సిక్ గ్లింప్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.