Toxic Movie: కేజీఎఫ్ స్టార్ యష్ బర్త్ డే.. టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..
కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈరోజున టాక్సిక్ చిత్రానికి సంబంధించి స్పెషల్ అప్డేట్ రానుందని నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్స్ హౌస్ ప్రకటించింది. తాజాగా టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
పాన్ ఇండియన్ స్టార్ యష్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ హీరో నటించిన చిత్రాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. కేజీఎఫ్ 1, 2 తర్వాత యష్ నటిస్తోన్న చిత్రం టాక్సిక్. దీంతో ఈ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా యష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తామని ‘టాక్సిక్’ టీమ్ గతంలోనే ప్రకటించింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఈరోజు విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. యష్ రెట్రో కారులో క్లబ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు క్లబ్ లో యూత్ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో యష్ ఓ వాటర్ బాటిల్ తీసుకుని అక్కడున్న మహిళపై పోశాడు. మేకింగ్ చూస్తుంటే రెట్రో స్టోరీలా అనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ద్వారా వెంకట్ నారాయణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇది పాన్-వరల్డ్ లెవల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.
Welcome to the untamed world of #ToxicTheMovie❤️🔥#ToxicBirthdayPeek : – https://t.co/hs6OhzQyfp #TOXIC @TheNameIsYash #GeetuMohandas @KVNProductions #MonsterMindCreations @Toxic_themovie pic.twitter.com/KfcHjwyjFB
— KVN Productions (@KvnProductions) January 8, 2025
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.