Tollywood: ‘కూతురు పుడితే బాగుందనకున్నా.. కానీ’.. రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిలైంది. 2023లో ఈ అమ్మడికి ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందిందీ అందాల తార.

Tollywood: 'కూతురు పుడితే బాగుందనకున్నా.. కానీ'.. రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Heroine
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2025 | 10:44 AM

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. బాలీవుడ్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషల్లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కల్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది సనాఖాన్. బాలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సుమారు 50 వాణిజ్య ప్రకటనల్లోనూ తళుక్కుమని మెరిసింది. ఇలా తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సంచలన నిర్ణయం తీసుకుంది సనాఖాన్. 2020 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది సనా. పెళ్లి తర్వాత దుబాయ్‌ కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు దంపతులకు 2023లో ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు. తరీఖ్ జమీల్ అని నామకరం చశారు. ఇప్పుడు సనాఖాన్ మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

కాగా రెండోసారి కూడా తనకు బాబు పుట్టినట్లు తెలిపింది సనాఖాన్. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పంచుకుందీ అందాల తార. ‘జనవరి 05న మాకు బాబు పుట్టాడు.అయితే నేను కూతురు పుడుతుందని ఆశపడ్డాను. పాప పుడితే ఏ పేరు పెట్టాలి? బాబు పుడితే ఏ పేరు పెట్టాలని తెగ ఆలోచించాను. అమ్మాయైతే ఎఫ్‌, జె, కె అక్షరాలతో పేరు స్టార్ట్‌ అవ్వాలని, అబ్బాయైతే టి, కె, ఎమ్‌ అక్షరాలతో పేరు మొదలవ్వాలి. అమ్మాయి పుడితే బాగుండని ఆశపడ్డాను. కానీ మళ్లీ అబ్బాయే జన్మించాడు’ అని సనాఖాన్ చెప్పుకొచ్చింది.

సనా ఖాన్ పోస్ట్..

భర్తతో సనాఖాన్..

సనాఖాన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .