Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా కోసం రామ్ చరణ్, శంకర్ ఎంత తీసుకున్నారో తెలుసా..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న తొలి తెలుగు సినిమా గేమ్ ఛేంజర్. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీంతో ఈమూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర, సముద్రఖని, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్, జయరామ్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ సుబ్బరాజు కథ, తమన్ సంగీతం అందించారు. 2021లో మొదలైన షూటింగ్.. 2024లో పూర్తైంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమా కోసం హీరో రామ్ చరణ్ ఎంత పారితోషికం తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ప్రొడక్షన్‌పై భారం పడకుండా ఉండేందుకు రామ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం ఈ సినిమాకు రామ్ తన పారితోషికం రూ.90 కోట్లు కాకుండా కేవలం రూ.65 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇక డైరెక్టర్ రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించడం గమనార్హం. వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తోన్న రెండో సినిమా ఇదే.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.