‘చంపుతానని బెదిరిస్తూ.. టార్చర్ చేస్తున్నాడు.!’ పోలీసులను ఆశ్రయించిన నిధి అగర్వాల్
ఫాలోయింగ్ మాటేమో కానీ సోషల్ మీడియాలో వార్నింగ్‌లు సెలబ్రిటీస్‌ను పరేషాన్ చేస్తున్నాయి. మొన్నటి మొన్న హీరోయిన్ హనీరోజ్‌కు..తాజా నిధి అగర్వాల్. సోషల్ మీడియా అబ్యూజ్డ్ పోస్టులపై హనీరోజ్ ఫిర్యాదుతో కేసు ఫైలయింది. లేటెస్ట్‌గా నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఓ వ్యాపారవేత్త తనను వేధిస్తున్నాడని ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు హారోయిన్ హనీరోజ్. పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారామె. సదరు వ్యాపారవేత్త ఈవెంట్స్‌ను తిరస్కరించానన్న కోపంతో తనను టార్గెట్ చేస్తూ ..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ..టార్చర్‌చేస్తున్నాడని కంప్లేంట్ ఇచ్చారామె. హనీరోజ్‌కు బెదిరింపుల కేసులో పోలీసులు ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. కట్ చేస్తే తాజా నిధి అగర్వాల్‌కు బెదిరింపుల వ్యవహారం తెరపైకి వచ్చియంది. తనను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు నిధి అగర్వాల్. విమర్శలైతే లైట్‌గా తీసుకోవచ్చు.కానీ లైఫ్ థ్రెటినింగ్ వార్నింగ్‌లు ఇవ్వడంతో మ్యాటర్‌ను సీసీఎస్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారామె. తనను తన కుటుంబసభ్యులను చంపేస్తానంటూ బెదిరింపుల పోస్ట్‌లు పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు వ్యక్తి పోస్ట్ చేసిన మెసేజ్‌ల స్ర్కీన్ షాట్స్‌ను పోలీసులకు ఇచ్చారు. మానసికంగా తనను వేధిస్తోన్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిధి అగర్వాల్ కంప్లేంట్ మేరకు కేస్ ఫైల్ చేసిన సీసీఎస్ పోలీసులు, ఆమెను బెదిరిస్తోన్న వ్యక్తి ఎవరో త్వరలోనే గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు . ఇక నిధి అగర్వాల్ నటించిన రెండు బిగ్ మూవీస్ హరహర వీరమల్లు, రాజాసాబ్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. పవన్, ప్రభాస్‌తో నటించిన ఆ రెండు సినిమాలతో తన కేరీర్ గ్రాఫ్ పెరుగుతుందనే ధీమాలో వున్న నిధి అగర్వాల్‌కు అజ్ఞాత శత్రువు పోస్టులు పరేషాన్‌గా మారాయి. మానసికంగా టార్చర్ చేస్తున్న ఆ వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటున్నారు నిధి అగర్వాల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి