అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!
నిత్యం వందలాది వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని తమ టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు చాలా మంది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇది ఓ అమ్మ చేసిన జుగాడ్ అని చెప్పాలి. ఎలాగంటే.. ఒక తల్లి తన కొడుకును స్కూల్‌కి రెడీ చేస్తోంది. అయితే, సాక్స్ గురించి మర్చిపోయిందో లేదంటే.. రాత్రి ఉతికిన సాక్సులు ఆరలేదో తెలియదు కానీ,
ఓ తల్లి తన కుమారుడిని వెరైటీ సాక్సులతో స్కూల్‌కి పంపించింది. సాక్స్ లేవనే విషయం ఎవరీకి తెలియకుండా ఉండేందుకు ఎవరూ ఊహించని ప్లాన్ వేసింది. ఈ వీడియోలో చూస్తే.. స్కూల్‌కి పంపించేందుకు ఆ తల్లి తన కొడుకును రెడీ చేస్తుంది. సాధారణంగా స్కూలుకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా షూతో పాటు సాక్సులను కూడా వేసుకోవాలి. లేదంటే, అందరి ముందు వాళ్లకి పనిష్మంట్ తప్పదు. కొన్ని స్కూల్స్‌లో యూనిఫామ్ సరిగా లేకపోతే, ఫైన్ కూడా వేస్తుంటారు. అందుకే ఈ తల్లి పిల్లాడికి సాక్స్ లేకుండా షూస్ వేసి స్కూల్‌కి పంపితే స్కూల్ వాళ్లు పనిష్మెంట్ ఇస్తారనే భయంతో అద్దిరిపోయే ఐడియా వేసింది. ఇంట్లో మాడిపోయిన కడాయి ఒకటి తీసుకొచ్చి.. తన కొడుకు కాళ్లకు సాక్స్ వేసినట్టుగా నల్లని మసిపూసి అతనికి షూస్ వేసి స్కూల్‌కి పంపించింది. కాగా, ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
