గుర్రానికి పోటీ ఇస్తున్న పొట్టేలు. బండిని చకచకా లాగేస్తూ..
సాధారణంగా బండిని ఎడ్లు, గుర్రాలు లాగుతాయి. కొన్నిచోట్ల గాడిదలు కూడా బండిని లాగడం చూసుంటారు. కానీ ఒక పొట్టేలు బండిని లాగడం ఎక్కడైనా చూశారా? అవును, ఓ బుల్లి పొట్టేలు చిన్న బండిని చకా చకా లాగేస్తూ సాటి జంతువులకు సవాలు విసురుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో కొర్లపాటి పాలెంకు చెందిన ఎర్రంశెట్టి శ్రీను తమ పశువులతో పాటు ఓ పొట్టేలును పెంచుకుంటున్నారు.
తెల్లగా, పొట్టిగా ముద్దుగా ఉన్న ఆ పొట్టేలు అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీనుకి ఓ పాప ఉంది. ఆ పాప పొట్టేలుతో కలిసి ఆడుకుంటుంది. ఆ పాపను ఆడించేందుకు శ్రీను ఎండ్ల బండిని పోలిన ఓ చిన్న బండి తయారు చేశారు. ఓ రోజు ఈ బండిని పొట్టేలుకి కడితే లాగుతుందో లేదో చూద్దామనుకున్నాడు. వెంటనే దానిని పొట్టేలుకు కట్టి, ఆ బండిలో తన పాపను కూర్చోబెట్టాడు. అంతే ఆ పొట్టేలు తన యజమాని అంచనాలను మించి చకచకా బండిని లాగేసింది. తన చిట్టిపొట్టి కాళ్లతూ బండిని ఎంతో చలాకీగా లాగేస్తూ అటూ ఇటూ తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంది. ఈ పొట్టేలు బండిని చూసినవాళ్లు.. ఇది భూమికి జానెడు లేదు.. బండిని భలే లాగేస్తోందే అంటూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ వీడియోలు
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

