నీళ్ల కోసం వచ్చి..కాలువలో పడిపోయిన జింక!
ఇటీవల కాలంలో అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వన్యప్రాణులు ఎక్కువగా వస్తున్నాయి. దారి తప్పడమో లేక వేటగాళ్ల నుంచి తప్పించుకొనో గ్రామాల్లోకి, రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే ఒంగోలు బైపాస్ రోడ్డుపై జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ జింక రోడ్డుపై పరిగెడుతూ బైక్‌ను ఢీ కొట్టి కాలువలో పడిపోయింది. జింకను బయటకు తీసేందుకు స్థానికులు విశ్వ ప్రయత్నం చేసి వీలు కాకపోవడంతో చివరకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డుపై పరిగెడుతూ బైక్‌ను జింక ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న భార్యాభర్తలు కిందపడిపోవడం వల్ల గాయాలయ్యాయి. ఈ ఘటనతో బిత్తర పోయిన జింక పక్కనే ఉన్న పెద్ద సైడు కాలువలోకి దూకింది. కాలువ పెద్దదిగా ఉండటంతో బయటకు రాలేక జింక ఇబ్బందులు పడింది. జింకను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది జింకను పట్టుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఒంగోలు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. జింకను సురక్షితంగా తీసుకువెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
వైరల్ వీడియోలు
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
