ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పాల్గొనడం అనుమానమే. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో గాయపడిన కమిన్స్‌కు త్వరలో మోకాలికి శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పాట్ కమిన్స్ దూరమయ్యాడు. అలాగే, కమిన్స్‌కు మరో వారం రోజుల్లో మోకాలి స్కాన్ కూడా నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా సెలక్టర్ల చైర్మన్ జార్జ్ బెయిలీ వెల్లడించాడు.
స్కానింగ్ రిపోర్టు వచ్చిన తర్వాత పాట్ కమిన్స్‌కు శస్త్రచికిత్స అవసరమా.? లేక బెడ్ రెస్ట్ ఎన్ని వారాలు ఉంటుంది అనే అంశాలు తెలియాల్సి ఉంది . అయితే కమిన్స్ మోకాలికి విపరీతమైన నొప్పి వస్తోందని, అందుకే అతనికి సర్జరీ చేసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంటోంది. ఒకవేళ పాట్ కమిన్స్‌కు శస్త్రచికిత్స జరిగితే, ఒక నెలలోపు కోలుకునే అవకాశం లేదు. దీంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగులుతుందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని టోర్నీల్లోనూ విజయాలు సాధించింది. అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లేదా ODI ప్రపంచకప్ కావచ్చు. అది కాకుండా ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కావచ్చు. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీకి పాట్ కమిన్స్ అందుబాటులో లేకుంటే ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. కమిన్స్ ఔట్ అయితే ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ కనిపించడం దాదాపు ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి