Tirupati stampede: మోక్షమార్గంలో మృత్యుపాశం.. ఈ పాపం ఎవరిది..?
ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందాలన్న తీరాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదకు తెచ్చిందా? చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలు.! తిరుపతి తొక్కిసలాట విషయంలో జరిగింది అదేనా..? పోలీస్ అధికారి అనాలోచిత చర్య ఆరుగురి ప్రాణాలు తీసిందా..? ప్రాథమిక దర్యాప్తులో బయటపడుతున్న నిజాలు. వైకుంఠ విషాదం!

ప్రశాంతతకోసమో, పుణ్యంకోసమో వెళ్లినవారు అక్కడే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకరి నిర్లక్ష్యానికో కొందరి తొందరపాటుకో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఏడుకొండలపై ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఘటన. ఒక్కసారిగా తొక్కిసలాట. అందరినీ అదుపుచేసేసరికే పెనువిషాదం జరిగిపోయింది. ఇంత ఘోరం ఎలా జరిగింది? ఈ నిర్లక్ష్యానికి కారకులెవరు? అనుకోకుండా జరిగిన విషాదమా? ఏదన్నా కుట్ర ఉందా? తిరుపతి తొక్కిసలాటపై పోస్ట్‌మార్టం మొదలైంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇంతటి విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని గంటలపాటైనా క్యూలైన్లలో నిలుచుని వెంకన్న దర్శనం చేసుకుంటారు భక్తులు. దశాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో రద్దీ మామూలే. చిన్నచిన్న అసౌకర్యాలు, అప్పుడప్పుడూ భక్తుల ఫిర్యాదులే తప్ప, టెంపుల్ సిటీలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. సడెన్‌గా గేటు తెరవడమే తోపులాటకు కారణమంటున్నా.. అధికార యంత్రాంగం వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం(జనవరి 8) రాత్రి 8:20 నిమిషాల ప్రాంతంలో క్యూలైన్‌లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న మహిళను బయటికి రప్పించే క్రమంలోనే తొక్కిసలాట జరిగిందంటున్నారు స్థానిక అధికారులు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా… బైరాగిపట్టెడ దగ్గర జరిగిందీ దారుణం. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే బుధవారం మధ్యాహ్నం...
