Tirumala: తొక్కిసలాట ఘటనతో టీటీడీ అలర్ట్‌.. ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం..

ధనుర్మాసంలో మకర సంక్రాంతి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు నివాసం వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని నమ్మకం. ఇలలో వైష్ణవాలయాలను విష్ణు నివాసంగా భావిస్తారు. కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని భావిస్తారు. అందుకనే భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనం కోసం వేచి ఉంటారు. తిరుమలలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విద్యుత్ కాంతులతో రంగుల పువ్వులతో స్వామివారి ఆలయంతో సహా పరిసరాలు కనుల విందు చేస్తున్నాయి.

Tirumala: తొక్కిసలాట ఘటనతో టీటీడీ అలర్ట్‌.. ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం..
Vaikunta Ekadasi 2025
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2025 | 9:10 PM

వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణ కథనం. కనుక ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచి ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. అయితే స్వామివారి దర్శనం కోసం ఇచ్చే టోకెన్లను తీసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడమే కాదు .. టోకెన్ల కోసం పోటీ పడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి.. పలువురు గాయపడరు. ఆరుగురు మృతి చెందారు. ఈ తొక్కిసలాట ఘటనతొ అలర్ట్‌ అయిన టీటీడీ.. వైకుంఠ ఏకాదశికి పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఏడు కొండల్ని ఇప్పటికే అద్భుతంగా తీర్చిదిద్దింది. పూలతో శ్రీవారి ఆలయంతోపాటూ చుట్టుపక్కల ఆలయాల్ని అలంకరించారు. లైటింగ్, ఎలక్ట్రిసిటీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నాలుగున్న నుంచే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. దేశంలో HMPV వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

అయితే ఉత్తర ద్వారానికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన వారు వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు ఈ గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో