AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: గడ్డం మనిషి వ్యక్తితాన్ని నడవడికను తెలియజేస్తుందని తెలుసా.. ఏ గడ్డం ఆకారం ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం అంటే..

గడ్డం, పెదవులు, ముక్కు, కళ్ళు, నుదురు , చెవుల ఆకృతిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఈ రోజు ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా గడ్డం ఆకారం బట్టి తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అవును గడ్డం ఆకారం బట్టి వ్యక్తి నడవడిక, వ్యక్తిత్వాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చట. గడ్డం ఆకారం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఈ రోజు గడ్డం ఎటువంటి ఆకారంలో ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెల్సుకుందాం..

Personality Test: గడ్డం మనిషి వ్యక్తితాన్ని నడవడికను తెలియజేస్తుందని తెలుసా.. ఏ గడ్డం ఆకారం ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం అంటే..
Personality Test
Surya Kala
|

Updated on: Jan 09, 2025 | 7:10 PM

Share

మనిషి శరీర భాగాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి వ్యక్తిత్వం నిర్ణయించబడుతుందని చాలా మందికి తెలిసిందే. వ్యక్తిత్వాన్ని మనిషి నడిచే విధానం, కూర్చునే విధానం, నిద్రించే విధానం, పెదవులు, ముక్కు, కళ్లు, నుదురు, చెవులు, గడ్డం వంటి వాటి ఆకృతిని బట్టి తెలుసుకోవచ్చు. గడ్డం గుండ్రని, చతురస్రం, కుంభాకారంతో సహా వివిధ ఆకారాలలో ఉంటుంది. ఈ గడ్డం ఆకారం ఆధారంగా కూడా వ్యక్తీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

గడ్డం ఆకారం చతురస్రాకారంలో ఉంటె వీరు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడరు. గోప్యతను ఇష్టపడతారు. శాంతితో ఉండాలని కోరుకుంటారు. ఎటువంటి పరిస్తితి ఎదురైనా నాటకీయత నెలకొనేలా ప్రవర్తించరు. సొంత ఆలోచనలను కలిగి ఉంటారు. వాటికి మరింత కట్టుబడి ఉంటారు. తమ అభిప్రాయాలతో ఎవరినీ వంచించరు. వీరు తమ మనసు చెప్పిన విషయాన్నీ అనుసరిస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే వీరి నిజాయితీ, క్రమశిక్షణ కారణంగా ఇతరులతో గౌరవింపబడతారు.

గడ్డం వృత్తాకారంగా ఉంటే.. ఇటువంటి వ్యక్తులు సగటు తెలివితేటలు కలిగి ఉంటారు. నిర్ణయాత్మకంగానే కాదు స్వతంత్ర జీవితాన్ని ఇష్టపడతారు. సవాళ్లను స్వీకరిస్తారు. ఒత్తిడిని సులభంగా నిర్వహిస్తారు. చురుకైన గ్రహణ సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా వ్యక్తిగత జీవితంలో విజయం సాధింస్తారు. సహజ సమస్యలకు వాస్తవికతతో పరిష్కారాలను కనుగొనడానికి ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

గడ్డం గుడ్డు ఆకారంలో ఉంటే.. అంటే చిన్ ఒవెల్ ఆకారం ఉన్నవారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు అధిక ఆత్మవిశ్వాసం, జీవిత సవాళ్లను ఎదుర్కొనే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరి చరిష్మాతో గుర్తించబడతారు. ఈ వ్యక్తులు స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిని చుట్టూ ఉన్న వ్యక్తులు అధికంగా ఇష్టపడతారు. ఎవరికైనా ఆపద అంటే ముందు ఉంటారు. ఉపకారం, సహాయం చేసే స్వభావం ఉంటుంది. ఆశాజనకంగా ఉండటం వలన వీరు ఎంత మంది మధ్య ఉన్నా.. తమ కంటూ సొంత గుర్తింపు కలిగి ఉంటారు.

గడ్డం ఆకారం వలయం ఆకారంలో ఉంటే వీరు భావోద్వేగ జీవులు. తమ భావాలను వ్యక్తీకరించడానికి వెనుకాడరు. భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం వలన వీరికి వీరే హాని చేసుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో ఈ గుణం ఇతరులను దగ్గరగా చేరుస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇతరులతో లోతుగా కనెక్ట్ అవుతారు.

గడ్డం కర్వ్ ఆకారంలో ఉంటే ఈ వ్యక్తులు అన్నింటికంటే సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులే వీరి ప్రపంచం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. సహజంగా వారి సానుకూలత దృక్పధంతో ఇతరులను ఆకర్షిస్తారు. అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకునే విషయానికి వస్తే నిజాయితీ, .నిబద్ధత అనేవాటికి వీరు విలువ ఇస్తారు.

గడ్డం చదునుగా ఉంటే ఏదైనా పనిని చేపట్టినప్పుడు.. నేను చేయగలనా అనే స్వీయ సందేహంతో ఉంటారు. ఈ వ్యక్తులు ఇతరులను ఆకర్షించే అయస్కాంత శక్తిని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి సలహా తీసుకుంటారు. వీరిలో ఎక్కువ మంది ఒక్కోసారి అభద్రతా భావంతో ఉంటారు. వీరు నమ్మదగిన వ్యక్తులు. ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియమైన వారితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)