ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్.. పంచాయితీ ప్రకటన..
పెళ్ళంటే నూరేళ్ల పంట.. దంపతులు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటారు. అయితే కొంత కాలం క్రితం వరకూ పెళ్లిని ఓ సాంప్రదాయ వేడుకగా పవిత్రమైన కార్యక్రమంగా భావించేవారు. అయితే ఇప్పుడు పెళ్లి వేడుక ఓ స్టేటస్ సింబల్ గా మారింది. సామాన్యులు కూడా శక్తి మించి ఖర్చు పెట్టి మరీ పెళ్లి వేడుక చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెళ్లి ఖర్చులకు అదుపులో పెట్టేందుకు ఓ గ్రామ పంచాయితీ సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం, డీజే వంటివి లేకుండా పెళ్లిని నిర్వహిస్తే రివార్డ్ ను ప్రకటించింది. ఆ గ్రామం ఎక్కడ ఉందంటే..
పుష్య మాసం అంటే శూన్య మాసం వెళ్లి మరికొద్ది రోజుల్లో మాఘ మాసం రానుంది. దీంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పుడు పెళ్లి వేడుక అంటే ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అప్పు చేసిన అయినా సరే ఘనంగా పెళ్లి చేయాలనీ కోరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో DJ, మద్యం వంటివి లేకుండా వివాహాలు అసంపూర్ణంగా కూడా పరిగణించబడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో.. పెళ్లి వేడుకలు ప్రారంభానికి ముందు పంజాబ్‌లో ఒక గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. బటిండా గ్రామ పంచాయితీ ఒక స్పెషల్ ప్రకటన చేసింది. ఎవరైనా మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ దంపతులకు రూ.21 వేలు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
బల్లో గ్రామ సర్పంచ్ అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ పెళ్లిళ్లలో వృధా ఖర్చులు తగ్గించడంతోపాటు పర్యావరణానికి మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం వల్ల పెళ్లిళ్లలో తరచూ గొడవలు జరుగుతున్నాయని కౌర్ తెలిపారు. అంతేకాదు డీజే వల్ల చాలా సార్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అనవసర ఖర్చులు తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు
వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని కోర్ చెప్పారు. పెళ్లిలో మద్యం, డీజేలు వాడొద్దని పంచాయతీ తీర్మానం చేసింది.. అంతేకాదు రూ.21 వేలు బహుమతిగా ఇస్తామని తెలిపారు. కోర్ గ్రామంలో ఈ ప్రతిపాదనను అమలు చేసినట్లు తెలిపారు.
11 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం
కొన్ని రోజుల క్రితం హర్యానాలోని హిసార్‌లోని ఉక్లానా మండి ప్రాంతానికి చెందిన ఖైరీ గ్రామంలో పంచాయితీ కూడా పెళ్లి వేడుకలో DJకి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి వేడుకల్లో డీజే వాయించే వారికి రూ.11,000 జరిమానా విధించాలని పంచాయతీ తెలిపింది. గ్రామంలోని ప్రజలు పెళ్లికి 3-4 రోజుల ముందు నుంచే డీజే మొదలు పెడుతున్నారని.. దీంతో ఇతర వ్యక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పంచాయితీ చెబుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఎవరి ఇంట్లో ఏ పెళ్లి వేడుకకు డీజే ఏర్పాటు చేయకూడదని పంచాయతీ సిబ్బంది ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..