Los Angeles: లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. 16000 ఎకరాల్లో విధ్వంసం.. హాలీవుడ్ నటుల ఇల్లు సైతం దగ్ధం..
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం బీభత్సం సృష్టిస్తోంది. అగ్నికి వాయువు తోడై ఆ ప్రాంతాన్ని దహిస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక విమానాశ్రయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు కూడా ఈ అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. ఈ అగ్నిప్రమాదం వలన అమెరికాలో ఎంతటి భారీ నష్టం జరిగిందో తెలుసుకుందాం..
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు భయానక రూపం దాల్చింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. 70 వేల మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు వేలాది భవనాలు ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. నివేదిక ప్రకారం ఈ మంటలు మొదట పసిఫిక్ పాలిసాడ్స్, ఈటన్, హర్స్ట్ అడవులలో ప్రారంభమయ్యాయి. తరువాత అది నివాస ప్రాంతాలలో వ్యాపించడం ప్రారంభించింది. ఈ అగ్నిప్రమాదం భారీ నష్టం జరిగింది.
- కాలిఫోర్నియా అడవి మంటలు చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్నిగా అభివర్ణిస్తున్నారు. ఈ మంటలను ఆర్పడానికి అయ్యే ఖర్చు.. మంటలు ఆరిన అనంతరం ఏర్పడనున్న పరిణామాలు బిలియన్ల డాలర్లకు చేరుకుంటాయి. అందుకే డోనాల్డ్ ట్రంప్ దీనిని అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదం అని పిలిచారు.
- ఈ అగ్నిప్రమాదం వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. సుమారు 70 వేల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. కాగా ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో రానున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని 50 వేల మందిని ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రజల గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. చాలా మందికి తమ ఇంట్లోని వస్తువులను బయటకు తీసుకోవానికి కూడా సమయం దొరకడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా 1500కు పైగా భవనాలు దగ్ధమయ్యాయి.
- సిఫిక్ పాలిసేడ్స్ అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో కాలిఫోర్నియాలోని పసదేనా నగరంలో యూదుల ప్రార్థనా స్థలం దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హెలికాప్టర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
- మీడియా నివేదికల ప్రకారం ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 16,000 ఎకరాలకు పైగా భూమి ప్రభావితమైంది. దీనివల్ల 52-57 బిలియన్ డాలర్ల విలువైన నష్టం వాటిల్లింది. కాలిఫోర్నియా అడవుల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంటలు చెలరేగాయి. ఒక్క 2020 సంవత్సరంలోనే 5 అగ్నిప్రమాదాలు సంభవించాయి.
- అయితే ఈ మంటలు ఆర్పడానికి నీళ్లు లేవు, దేశాన్ని నడపడానికి డబ్బు లేదు..అంటూ ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు
- నిరంతరం వ్యాపిస్తున్న మంటలు ఇప్పుడు విమానాల రాకపోకలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. లాస్ ఏంజిల్స్ అడవి మంటల సమీపంలో FAA విమానాలను నిషేధించింది. మంటలు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
- చాలా మంది హాలీవుడ్ స్టార్లు కూడా లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తాము ఇల్లు ఖాళీ చేసినా ఈ అగ్నిప్రమాదంలో లక్షలాది డాలర్ల విలువైన తమ ఇల్లు ఎలా ఉంటుందో అంటూ ఆందోళన చెందుతున్నారు.
- కాలిఫోర్నియాలోని పాలిసాడ్స్‌లోని 3 పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరి కొన్ని పాఠశాలలు దగ్ధం కాగా మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిని సరిచేయాలంటే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
- ఈ అగ్నిప్రమాదం NASAని కూడా ప్రభావితం చేసింది. NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ సోమవారం వరకు మూసివేశారు. దీంతో చాలా కాలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.. అయితే ఇప్పుడు ఈ పలు పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది.
- ఈ మంటలు పసిఫిక్ పాలిసాడ్స్‌లో అత్యంత తీవ్రమైన విధ్వంసానికి కారణమైంది. ప్రతి నిమిషం 5 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన భూమి నాశనం అవుతోంది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం కౌంటీ.
- మీడియా నివేదికల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో కనీసం 15 లక్షల మంది ఇళ్లలో ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలుల కారణంగా కార్మికులు మంటలను అదుపు చేయలేకపోతున్నారని ఫైర్ బెటాలియన్ చీఫ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..