Astrology: నాలుగు గ్రహాల అనుకూలత.. వారికి ఆ సమస్యల నుంచి విముక్తి..!
ఈ ఏడాది నాలుగు ప్రధాన గ్రహాలు శని, గురువు, రాహుకేతువులు రాశి మార్పు ఉండబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు ఆశించిన శుభ ఫలితాలను పొందబోతున్నారు. నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కూడా తప్పకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వీరు బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి కొన్ని రాశుల వారికి విముక్తి లభించనుంది.
ఈ ఏడాది నాలుగు ప్రధాన గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారు ఆశించిన శుభ ఫలితాలను పొందబోతున్నారు. శని, గురువు, రాహుకేతువులు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కూడా తప్పకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ నాలుగు గ్రహాల రాశుల మార్పు వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు తమను చాలా కాలంగా పట్టి పీడిస్తున్న కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారిని దాదాపు రెండున్నరేళ్లుగా ఆర్థిక, ఉద్యోగ సమస్యలు పీడించడం జరుగుతోంది. రాబడిలో ఎక్కువ భాగం వృథా కావడం, డబ్బు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, అప్పులు చేయాల్సి రావడం వంటి సమస్యలతో అవస్థలు పడడం జరుగుతోంది. ఉద్యోగంలో పనిభారం పెరగడం, గుర్తింపు రాకపోవడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 తర్వాత నుంచి వీరికి వీటి నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనుకూలతలు వృద్ది చెందుతాయి.
- మిథునం: ఈ రాశివారికి చాలా కాలంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు బాధిం చడం జరుగుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది. మార్చి ద్వితీ యార్థం నుంచి వీరికి ఆర్థిక సమస్యలు, మే 18 తర్వాత నుంచి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా త్వరలో పెద్దల జోక్యంతో పరిష్కారమయ్యే అవ కాశం ఉంది. గురు, రాహువుల బలం పెరగబోతున్నందువల్ల ఈ ఏడాది సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
- కన్య: ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారిని ఏడాదిన్నరగా ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు పీడించడం జరుగుతోంది. ఉద్యోగంలో టెన్షన్లు, ప్రతికూ లతల కారణంగా ఇబ్బందిపడడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉంది. మే 18 తర్వాత నుంచి అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా సరైన గుర్తింపు లభించడం, పదోన్నతులు కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి ఏడాదిగా గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు పీడించడం జరుగుతోంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించక, గుర్తింపు లేక ఇబ్బంది పడడం కూడా జరుగు తోంది. మే 25 తర్వాత నుంచి గురువు రాశి మార్పుతో వీరికి ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు తీరే సమయం ప్రారంభం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది.
- ధనుస్సు: ఏడాది కాలంగా ఈ రాశివారు ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడడం జరుగుతోంది. ఉద్యోగంలో ఎదుగూ బొదుగూ లేక, ఆదాయం పెరగక ఈ రాశివారు పడుతున్న బాధలు ఫిబ్రవరి 16 నుంచి క్రమంగా తొలగిపోవడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల కొన్ని ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారిని గత రెండున్నరేళ్లుగా పీడిస్తున్న వ్యక్తిగత, కుటుంబ సమస్యలు మే 25 తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. గురువు అనుకూలంగా మారుతుండడంతో ఏడాది ద్వితీయార్థం నుంచి హ్యాపీగా, సానుకూలంగా జీవితం సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. కుటుంబ, దాంపత్య సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా పురోగతి ఉంటుంది.