Horoscope Today: వారికి కొద్ది ప్రయత్నంతో అత్యధిక ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 10, 2025): మేష రాశి వారికి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి కొద్ది ప్రయత్నంతో అత్యధిక ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 10th January 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 10, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 10, 2025): మేష రాశి వారికి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు మీ సలహాలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పురోగ మిస్తారు. ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు గడిస్తారు. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ స్థానాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, జీత భత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా, సజావుగా సాగిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు తప్పకపో వచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పని తీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపా రాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొత్త లక్ష్యాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కోరుకున్నపెళ్లి సంబందం కుదిరే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు పొందుతారు. కొద్ది శ్రమతో వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కించుకుంటారు. ఆదాయం, ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. గ్రహ బలం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అను కూలంగా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద శ్రద్ద పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

గురు బలం వల్ల ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వృత్తి జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సన్నిహితుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కొందరు బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.