దబిడి దిబిడి పాటకు ఊర్వశి ఎన్ని కోట్లు తీసుకుందటే?

09 January 2025

Basha Shek

నందమూరి నటసింహం బాలకృష్ణ,  డైరెక్టర్ బాబీ  కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్

ఈ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. 

వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా  డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యతో కలిసి ఓ స్పెషల్ సాంగ్ చేసింది

దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్‌ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే సమయంలో ట్రోల్ కూడా అవుతోంది.

ఎంత నెగెటివిటీ ఉన్నా  బాలయ్య అభిమానులను మాత్రం ఈ దబిడి దిబిడి మాస్ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది.

కాగా ఈ పాటలో నటించేందుకు గానూ  బాలీవుడ్ అందాల తార ఊర్వశి తీసుకున్న పారితోషికం చర్చనీయాంశమైంది. 

ఈ పాట కోసం ఆమె సుమారు రూ. కోటి పారితోషికం అందుకున్నట్లుగా ఫిలింనగర్‌లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.