Warangal: దండుపాల్యం గ్యాంగ్ సినిమాను మరిపించిన అత్తా కోడళ్ళు.. ఎంత దోచేశారో తెలిస్తే షాక్..!
హనుమకొండలో తాళంవేసి ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ మహిళా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గమనించి, ఇంటి తాళం పగలగొట్టి, సొత్తంతా ఎత్తుకుపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అత్తా కోడళ్లు అయ్యిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అత్తా కోడళ్ళు అంటే కామన్‌గా కస్సు బుస్సులాడుకుంటారనేది నానుడి..! కానీ ఈ అత్తా కోడళ్ళు మాత్రం సంథింగ్ స్పెషల్..! తాళం వేసి ఉన్న ఇళ్ళు కనబడితే చాలు ఇళ్ళు గుల్లే..! కలిసి కన్నం వేసి దొరికినకాడికి దోచుకుంటున్న ఆ ముఠా పోలీసులకు నిద్ర లేకుండా చేశారు. వరంగల్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆ మహిళా దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి వద్ద దొంగిలించిన సొత్తంతా రికవరీ చేసి కటకటాల్లోకి పంపారు. అచ్చం దండుపాళ్యం సినిమాను తలపించిన అత్తా కోడళ్ళ దోపిడీ కహాని మీరు తెలుసుకోండి..!
పగలంతా చిత్తు కాగుతాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటున్నట్టు నటిస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేస్తారు. రాత్రిపూట దోపిడీలకు పాల్పడడం వీళ్ళ హాబీ. ఈ అత్తాకోడళ్ళు అచ్చం దండుపాళ్యం సినిమాను మరిపించే తరహాలో దొంగతనాలకు పాల్పడి, అటు పోలీసులకు.. ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎట్టకేలకు పక్కా ఫ్లాన్ వేసి, అత్తా కోడళ్ల గుట్టురట్టు చేశారు వరంగల్ జిల్లా పోలీసులు.
హనుమకొండలో తాళంవేసి ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ మహిళా దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజులుగా భీమారం, గోపాలపురం, విజయనగర్ కాలనీలో పలు ఇళ్ళల్లో దోపిడీలకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గమనించి, ఇంటి తాళం పగలగొట్టి అందులోని సొత్తంతా ఎత్తుకుపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, పక్కా ఆధారాలతో దొంగలను గుర్తించారు పోలీసులు. దోపిడీలకు పాల్పడిన ఈ మహిళా దొంగలు వరంగల్ శివారు బుడగ జంగాల కాలనీకి చెందిన లచ్చమ్మ, ఆమె కోడళ్ళు మేరీ, కనకలక్ష్మీగా నిర్ధారించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి 17 తులాలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. అత్తా కోడళ్ళు ముగ్గురిని కటకటాల్లోకి పంపారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎరుకుంటున్నట్లు నటించి దోపిడీలకు పాల్పడడం వీళ్ళ హాబీ అని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..