Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

Anil kumar poka

|

Updated on: Dec 02, 2024 | 1:12 PM

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కొనసాగే అవకాశం ఉందని... దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుపాన్ ఫెంగల్.. అత్యంత వేగంగా.. భారతదేశం వైపు దూసుకొస్తోంది.

తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. నాగపట్నానికి 590 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. మరో వైపు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయపురం, పెరంబూరు, బ్రాడ్‌వేలో భారీ వర్షం పడుతుంది. వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు , సర్వేపల్లి, కావలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులపాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు అధికారులు.. సముద్రంపై వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.