ప్రొటీన్ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత మొత్తంలో నీరు అందించాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రొటీన్ ఆహారం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నీళ్లు అధికంగా తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వెనుక పెద్ద రహస్యమే ఉందట. అదేంటో తెలుసుకుందాం. నీరు మన శరీరానికి చాలా ముఖ్యం.
నీళ్లు తగినంత తాగకుంటే శరీరం నిర్వీర్యమైపోతుంది. అందుకే మానవ మనుగడలో నీరు ప్రధానమైనదిగా చెబుతారు. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మన శరీర పనితీరును క్రమబద్ధం చేస్తుంది. శరీరంలో వివిధ రకాల జీవక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది. పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే ప్రకారం.. ఎక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారం తిన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. శరీరంలోకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పెరిగితే, నీరు కూడా ఎక్కువగా త్రాగాలి. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే శరీరం యూరియా వంటి వ్యర్థ పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసి విసర్జిస్తుంది. ఇది కిడ్నీలు ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది తగినంతగా హైడ్రేట్‌గా ఉండాలి. మనం తీసుకునే భోజనంలో 25 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే, శరీరం ఒకేసారి జీర్ణం చేయడానికి కష్టపడుతుంది. అలాకాకుండా ప్రోటీన్ తీసుకోవడం క్రమంగా పెంచడం ద్వారా, జీర్ణవ్యవస్థకు తగినంత సమయం లభిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
స్టేషన్‌లో వీల్‌చైర్ కు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు
Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..
నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..
14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..