పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!

పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!

Phani CH

|

Updated on: Jan 05, 2025 | 4:31 PM

పాలు, మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మఖానాలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనిని పాలతో కలిపినప్పుడు రెట్టింపు శక్తి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకల ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మఖానా నుండి కార్బోహైడ్రేట్లు, పాలలోని సహజ చక్కెరలతో కలిపినపుడు శక్తిని అందిస్తాయి. మఖానాలోని తక్కువ కేలరీలతో చేసే స్నాక్‌… బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. పాలు, మఖానా రెండూ కలిపి తినడం వల్ల అది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా మఖానా సహకరిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం కారణంగా రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. మెదడు పనితీరుకు మేలు చేస్తుంది. పాలలోని ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఏకాగ్రతను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. మఖానా తక్కువ గ్లైసెమిక్ చక్కెరను విడుదల చేస్తుంది. పాలలో విటమిన్ A, E ప్రభావం చూపిస్తాయి. మఖానాను పాలలో కలిపి తీసుకోవడం వల్ల వాపు, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??

ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..

స్టేషన్‌లో వీల్‌చైర్ కు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు

Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..

నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..