హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ అలియాబాద్ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాడు. మద్యం మత్తులో ఎదురొచ్చే వాహనదారులను గుద్దుకుంటూ ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ నానా హంగామా చేశాడు.