ISRO Spadex: చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న Spadex.. సాంకేతిక సమస్యతో వాయిదా!

ఇస్రో డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి స్పాడెక్స్ మిషన్‌ను ప్రయోగించింది. రెండు అంతరిక్ష నౌకలు - SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) PSLV-C60 రాకెట్‌తో భూమికి 475 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్ జనవరి 9న బుల్లెట్ వేగం కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణించే ఈ రెండు వ్యోమనౌకలు అనుసంధానం కానున్నాయి.

ISRO Spadex: చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న Spadex.. సాంకేతిక సమస్యతో వాయిదా!
Isro Spadex
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Jan 06, 2025 | 10:04 PM

ఇస్రో డిసెంబర్ 30న శ్రీహరికోట నుంచి స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ మిషన్‌ను ప్రారంభించింది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి 60 ప్రయోగం ద్వారా స్పడెక్స్ అనే రెండు జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి కీలకమైన ప్రయోగాన్ని విజయవంతం చేసి చూపించింది. అంతరిక్షంలో డాకింగ్ అన్ డాకింగ్ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యం అయ్యే టెక్నాలజీ. కాగా భారత్ తాజా ప్రయోగం విజయవంతంతో ఆ దేశాల సరసన చేరింది.అదే ప్రయోగంలో మరో కీలకమైన ప్రయత్నంలో కూడా ఇస్రో సక్సెస్ అయ్యింది.

అంతరిక్షంలోకి spedex జంట ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపడంలో ఇస్రో సక్సెస్ అయ్యింది. అయితే ఇందులో అసలైన ప్రక్రియ డాకింగ్ అన్ డాకింగ్.. ఆంటే చేజర్.. టార్గెట్ అనే రెండు పరికరాలు ఒకదానితో ఒకటి లింక్ అవడం.. అలాగే అన్ లింక్ అవడం. భారత్ అంతరిక్షంలో మొదలు పెట్టనున్న స్పేస్ సెంటర్ నిర్మాణంలో ఈ spedex ఉపగ్రహాల ప్రయోగం అనేది అత్యంత కీలకం కాబోతోంది. ఫేస్ సెంటర్ నిర్మాణం కోసం అవసరమయ్యే మెటీరియల్ దశలవారీగా తీసుకెళ్ళేందుకు ఈ ప్రక్రియ ఎంతో ముఖ్యం. అలాగే అంతరిక్షంలో ఉపయోగంలో ఉన్న ఉపగ్రహాలకు మరమ్మతులు చేయడం వ్యర్ధాలను దూరం చేయడం ఇలాంటి ప్రక్రియ కూడా దీని ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే ఇది అత్యంత కీలకమైన ప్రయోగంగా చెబుతోంది ఇస్రో.

ప్రయోగం సక్సెస్ అయింది అయితే వీలకమైన డాకింగ్ అన్ డాకింగ్ జరిపే సమయంలో చిన్న సాంకేతిక సమస్య ఉన్నట్లు శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు. జనవరి 7న జరగాల్సిన ఈ ప్రయోగాన్ని రెండు రోజులు వాయిదా వేస్తూ జనవరి తొమ్మిదోవ తేదీన చేపట్టాలని నిర్ణయించారు. చేజర్ అలాగే టార్గెట్ ఈ రెండు ఉపగ్రహాలు లేదా పరికరాలు లింక్ అయ్యే ప్రక్రియలో సెన్సార్ లో సమస్య ఉన్నట్టు గుర్తించారు. రానున్న 48 గంటల్లోపు దీనిని సరిచేసి జనవరి 9న తిరిగి డాకింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.

గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ అయినా.. ల్యాండర్ లాండ్ అయ్యే ప్రక్రియలో సాంకేతిక లోపం కారణంగా క్రాష్ ల్యాండ్ అయింది. యావద్దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూసిన ఆ ప్రయోగం విఫలం కావడంతో అందరూ నిరుత్సాహంలో మిగిలిపోయారు. అయితే చంద్రయాన్-3 ద్వారా చంద్రయాన్-2 లో అందుకోలేని విజయాన్ని ఇస్రో సక్సెస్ చేసి చూపించింది. తాజాగా అమెరికా చైనా రష్యా లాంటి దేశాలు మాత్రమే చేపట్టగలిగిన ఈ డాకింగ్ అన్ డాకింగ్ ప్రక్రియను మిశ్రో సొంత టెక్నాలజీతో రూపొందించి ప్రయోగం చేపట్టింది.

అయితే అంతరిక్షంలో పరీక్షించే డాకింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్య రావడం వాయిదా పడడంతో కొంత టెన్షన్ మొదలైంది. అయితే నీవే పెద్ద సమస్య కాదని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి సమస్యను సరి చేసే ప్రయత్నం జరుగుతుందని 48 గంటల్లో దీనిని సరిచేసి జనవరి 9న ముందుగా అనుకున్నట్లు డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేస్తామని ఇస్రో ప్రకటించింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..