iPhone 15: అదిరిపోయే ఆఫర్‌.. కేవలం రూ.25 వేలకే ఐఫోన్‌ 15.. ఎలా?

iPhone: ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ను రూ. 69,900 ధరతో విడుదల చేశారు. ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు, ఆఫర్‌లను ఉపయోగించి దీనిని కేవలం రూ. 25,000కి కొనుగోలు చేయవచ్చు.

iPhone 15: అదిరిపోయే ఆఫర్‌.. కేవలం రూ.25 వేలకే ఐఫోన్‌ 15.. ఎలా?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 06, 2025 | 7:49 PM

చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ కొనాలనే కోరిక ఉంటుంది. అయితే, ఐఫోన్లు ధర ఎక్కువగా ఉండటంతో వెనుకంజ వేస్తుంటారు. చాలా మంది వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. ఐఫోన్‌లు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ, మీరు వాటిని చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం కొన్ని ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌ను ఉపయోగించి మీరు ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.25,000కే కొనుగోలు చేయవచ్చు. మరి ఇంత తక్కువ ధరల్లో ఎలా అనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.69,900 ఉంది. ఆఫర్‌లో కేవలం రూ.25,000తో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై డీల్స్‌:

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2023లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 69,900కు విడుదల చేయగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ తగ్గింపుతో కేవలం రూ.60,999కే విక్రయిస్తున్నారు. అంటే ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ రూ.9,000 తగ్గింపును అందిస్తోంది. అంతే కాకుండా, కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అదనంగా రూ.1,000 తగ్గింపు అందిస్తున్నాయి. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.59,900కి కొనుగోలు చేయడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 15 కేవలం రూ.25,000కే ఎలా..?

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.10,000 వరకు తగ్గింపును అందజేస్తుండగా, పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ పెట్టుకుంటే రూ.46,950 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మీ పాత ఐఫోన్ మంచి కండిషన్‌లో ఉండాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అప్పుడు మీకు ఈ ధర లభిస్తుంది. ఈ ఆఫర్‌లను ఉపయోగించి, మీరు దాదాపు రూ.69,900 విలువైన iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.25,000తో కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15 ప్రత్యేకతలు ఏమిటి?

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ను రూ. 69,900 ధరతో విడుదల చేశారు. ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు, ఆఫర్‌లను ఉపయోగించి దీనిని కేవలం రూ. 25,000కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ ఫోన్‌ పదేపదే వేడెక్కుతుందా..? మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్లే..!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి