WhatsApp: వాట్సాప్‌లో త్వరలో రివర్స్ ఇమేజ్ సెర్చ్.. ప్రత్యేకతలు ఏమిటి?
Reverse Image Search: వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ యాప్‌ను చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అనేది చాలా మందిలో ముఖ్యమైన భాగమైపోయింది. తాజాగా వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్. దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..
రెండు బిలియన్ల నెలవారీ వినియోగదారులతో మెటా కంపెనీ వాట్సాప్ యాప్ వినియోగదారుల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. వాట్సాప్ యాప్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌లో ఎన్నో రకాల పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. చాలా మంది వ్యక్తుల రోజు వాట్సాప్‌తో మొదలవుతుంది. దీనితోనే ముగుస్తుంది కూడా. ఆ స్థాయిలో వాట్సాప్ ప్రజాజీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్నందున, ఇది తన వినియోగదారుల ప్రయోజనం కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అది ఏమిటో చూద్దాం.
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్:
వాట్సాప్ తన వినియోగదారుల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ కొద్ది రోజుల క్రితం నివేదించగా, ఇప్పుడు WABetaInfo ఈ ఫీచర్ త్వరలో WhatsApp వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ దశలో ఈ ఫీచర్ దేనికి ఉపయోగపడుతుంది? దాని ప్రత్యేక లక్షణాలు ఏమిటో చూద్దాం.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్ అంటే ఏమిటి?
WhatsApp కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తోంది. అయితే వాట్సాప్‌లో చాలా తప్పుడు సమాచారం, నకిలీ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వల్ల మోసం, నేరాలు జరుగుతున్నాయి. దాన్ని నివారించడానికి, Meta ఈ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు వాట్సాప్ నుండి నేరుగా గూగుల్‌లో ఫోటోను తనిఖీ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ ఫోటో నిజమో, నకిలీదో తెలుసుకోవచ్చు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ నకిలీ సమాచారాన్ని చాలా సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. త్వరలో ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి