AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New SIM Card Rules: ఇలాంటి వారు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్‌ లిస్ట్‌లోనే..

New SIM Card Rules: ఈ రోజుల్లో సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మీకు తెలియకుండానే ఇతరులు మీ పేరుపై సిమ్‌ కార్డును తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ట్రాయ్‌ రంగంలోకి దిగి నకిలీ సిమ్‌కార్డుల ఏరివేతను ప్రారంభించింది. మోసాలకు పాల్పడుతున్న వారి సిమ్‌ కార్డును..

New SIM Card Rules: ఇలాంటి వారు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్‌ లిస్ట్‌లోనే..
Subhash Goud
|

Updated on: Jan 05, 2025 | 9:08 PM

Share

మీకు ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ సిమ్ కార్డులు, మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం కొత్త సిమ్ కార్డ్ నిబంధనలను అమలు చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), టెలికాం శాఖ (DoT) వేల సంఖ్యలో నకిలీ మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయడం ద్వారా ప్రజలకు భద్రత కల్పించే దిశగా పెద్ద అడుగు వేసింది.

వేలల్లో సిమ్‌ కార్డులు డియాక్టివేట్

నకిలీ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మోసాలను అరికట్టడమే కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం. TRAI పెద్ద సంఖ్యలో నకిలీ మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. ఇది మోసం నుండి వినియోగదారులకు ఉపశమనం అందిస్తుంది.

మోసగాళ్లపై కఠిన చర్యలు:

ఇప్పుడు మరొకరి పేరు మీద సిమ్ కార్డు తీసుకోవడం లేదా నకిలీ సిమ్ ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భాల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్‌ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించి శిక్షించనున్నారు.

మూడు సంవత్సరాల బ్లాక్ లిస్ట్

నకిలీ సిమ్ కార్డులు వాడే వ్యక్తులను మూడేళ్లపాటు బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతారు. వారి యాక్టివ్ సిమ్ కార్డ్‌లు అన్నీ బ్లాక్ చేయబడతాయి. వారు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు కొత్త సిమ్ పొందకుండా నిషేధిస్తుంది ట్రాయ్‌.

బ్లాక్‌లిస్ట్ డేటాబేస్ ఆధారంగా..

2025 నుండి నకిలీ సిమ్ కార్డ్ వినియోగదారుల సమాచారాన్ని ప్రభుత్వం అన్ని టెలికాం కంపెనీలతో పంచుకుంటుంది. ఈ వ్యక్తుల పేరిట మళ్లీ సిమ్‌కార్డులు జారీ కాకుండా చూసుకోవాలి. ఒక డేటాబేస్ తయారు చేయబడుతుంది. అలాగే సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపుతుంది. వారు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రజలకు భద్రత

కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు నకిలీ కాల్స్, మోసాలను నివారించాలి. డిజిటల్ సేవల్లో భద్రత, పారదర్శకతను తీసుకువచ్చే దిశలో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!