BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G నెట్‌వర్క్!
BSNL 4G:ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNL దూసుకుపోతోంది. 4జీ టవర్స్ ఏర్పాటులో ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా, పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 4జీ నెట్‌వర్క్ ఎప్పుటి వరకు వస్తోందో తెలుసా..?
మీరు BNSL వినియోగదారు అయితే మీకో శుభవార్త. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 4G నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నిరంతరం టవర్లను ఇన్‌స్టాల్ చేస్తోంది. ఇంతలో కంపెనీ తన 3G సేవను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది మిలియన్ల మంది వినియోగదారులను ప్రభావితం చేయబోతోంది. BSNL తన 3G సేవలను పాట్నాలో 15 జనవరి 2025 నుండి నిలిపివేయనుంది. అంతకుముందు మొదటి దశలో బీఎస్‌ఎన్‌ఎల్ ముంగేర్, ఖగారియా, బెగుసరాయ్, కతిహార్, మోతిహారిలలో 3G నెట్‌వర్క్‌ను నిలిపివేసింది. ఇప్పుడు 4జీ నెట్‌వర్క్‌ను అందించనుంది. పాట్నాతో సహా ఇతర జిల్లాల 3G నెట్‌వర్క్ ఇప్పుడు నిలిపివేయనుంది. దీంతో 3జీ సిమ్ ఉన్న కస్టమర్లకు కాలింగ్ సదుపాయం మాత్రమే లభిస్తుందని, డేటా సౌకర్యం లభించదని సంస్థ వెల్లడించింది.
లక్షల మంది వినియోగదారులపై ప్రభావం:
బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్‌కే చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో 4జీ నెట్‌వర్క్ పూర్తిగా అప్‌డేట్ చేశామని, దీంతో చాలా జిల్లాల్లో 3జీ నెట్‌వర్క్ నిలిపివేసినట్లు చెప్పారు. జనవరి 15 నుండి మిగిలిన నగరాల్లో కూడా 3G సేవ నిలిపివేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం, పాట్నా, ఇతర నగరాల్లో లక్షల మంది వినియోగదారులు 3G సేవను ఉపయోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా త్వరలో పూర్తి స్థాయిలో 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు.
4జీ సేవలు ఎప్పుడు?
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు విస్తరిస్తామని, 4జీ నెట్‌వర్క్ ప్రారంభమైన తర్వాత 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేశారు. 4జీ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 3జీ సిమ్ కార్డు ఉన్నవారు కాల్స్ మాత్రమే చేసుకోగలరు. డేటా సేవలు వినియోగించలేరు. ఇప్పుడు ఇచ్చే సిమ్‌కార్డులన్ని 5జీకి మద్దతు ఇచ్చేవి ఉన్నాయి. 5జీ సేవలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.
4జీ సిమ్ పొందాలంటే వినియోగదారులు తమ ఫోటో ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా 2017కి ముందు జారీ చేసిన సిమ్‌లను మాత్రమే మారుస్తున్నారు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఉచితంగానే ఇస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ – ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి