Auto Tips: శీతాకాలంలో మీ కారు మైలేజీ ఎక్కువ ఇవ్వాలా? డ్రైవింగ్‌లో ఈ చిట్కాలు పాటించండి!
Auto Tips: చలి రోజుల్లో కారును అతివేగంతో నడిపితే ఎక్కువ ఇంధనం ఉపయోగించుకుంటుంది. అటువంటి సమయాల్లో మీరు కారును గంటకు 60-80 కి.మీ వేగంతో నడపాలి. తద్వారా మీరు ఇంధనాన్ని ఆదా చేస్తారు. మీరు ఇంధనంపై ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడం.
చలికాలంలో కారు నడపడం వల్ల మైలేజీ తగ్గుతుందని చాలా మంది నుంచి మనం వినే ఉంటాం. మీకు కారు ఉంటే మైలేజ్ సమస్యలను కూడా గమనించవచ్చు. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ మైలేజీని 20 నుంచి 30 శాతం పెంచుకోవచ్చు. దీని కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. చలికాలంలో ఈ చిట్కాలను పాటిస్తే పెట్రోల్-డీజిల్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి నెలా చాలా డబ్బు ఆదా అవుతుంది.
1. అధిక వేగాన్ని నివారించండి:
చలి రోజుల్లో కారును అతివేగంతో నడిపితే ఎక్కువ ఇంధనం ఉపయోగించుకుంటుంది. అటువంటి సమయాల్లో మీరు కారును గంటకు 60-80 కి.మీ వేగంతో నడపాలి. తద్వారా మీరు ఇంధనాన్ని ఆదా చేస్తారు. మీరు ఇంధనంపై ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల మీ మైలేజ్ తగ్గుతుంది. కారు ఇంజన్‌పై ఒత్తిడి కూడా పెరుగుతుంది.
2. ఆకస్మిక బ్రేకింగ్ నివారించండి:
మీ కారు స్పీడ్‌గా ఉన్నప్పుడు ఆకస్మిక బ్రేకింగ్ వేయడం వల్ల మీ కారు మైలేజీని తగ్గించే అవకాశం ఉంది. నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఇంధన వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే కారు ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఏర్పడితే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.
3. గేర్లు మార్చడానికి సరైన సమయం:
గేరును సరైన సమయంలో మార్చడం వల్ల ఇంధనం తక్కువగానే వినియోగించుకుంటుంది. ఇష్టానుసారంగా గేర్లను మార్చడం వల్ల కూడా ఇంధనం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. గేర్లను సమయానికి మార్చడం వల్ల ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
4. టైర్ ఒత్తిడిని తనిఖీ చేయండి:
టైర్ ప్రెజర్ సరిగ్గా లేకుంటే, కారు మైలేజ్ తగ్గవచ్చు. ఎందుకంటే తక్కువ గాలితో కూడిన టైర్లు ఎక్కువ రాపిడిని సృష్టిస్తాయి. ఇది అధిక ఇంధన వినియోగానికి దారి తీస్తుంది. టైర్ ఒత్తిడిని ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉంచండి.
5. ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని పరిమితం చేయండి:
కారులో ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మైలేజీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏసీని ఉపయోగించవద్దు. అవసరం లేనప్పుడు ఏసీని ఉపయోగించకపోవడం మంచిది.
6. కారులో బరువైన సామాను తీసుకెళ్లడం మానుకోండి:
కారులో ఉంచిన అధిక బరువు కూడా కారు ఇంజిన్‌పై ఒత్తిడి తెచ్చి ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. కారులో ఎక్కువ బరువైన లగేజీతో ప్రయాణించవద్దు. ప్రత్యేకించి అది అనవసరమైతే తప్ప ఎక్కువ లగేజీని ఉంచకపోవడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి