AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుపయోగంగా గానగంధర్వుడి ఇల్లు.. పట్టించుకోవడంలేదంటున్న అభిమానులు

విశ్వం మెచ్చిన “తెలుగు గాయకులు” ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆయన దివికేగి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికీ ప్రతి సంగీత ప్రియుడు ఆ గంగంధర్వుడిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. కళాకారులకు మరణం ఎక్కడ.. మీరు బౌతికంగా మా మధ్యలేదు.. మీపాటలు, మీరు నటించిన సినిమాలతో మా మధ్య సజీవంగా .. మా మాది గదిలో ఓ అపురూపజ్ఞాకంగా చిరంజీవిలా చిరకాలం అంటూ ఆయన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు అభిమానులు.

నిరుపయోగంగా గానగంధర్వుడి ఇల్లు.. పట్టించుకోవడంలేదంటున్న అభిమానులు
Balasubramanyam
Ch Murali
| Edited By: |

Updated on: Jan 06, 2025 | 11:14 PM

Share

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా అందులోను నెల్లూరు జిల్లా ప్రజలకు అయితే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంటే సొంత ఇంటి మనిషి లాగా ఎందుకంటే ఎస్పీ బాలు ది నెల్లూరు కావడమే..చిన్నతనంలోనే సంగీతం పై ఆసక్తి కారణంగా నెల్లూరు వదిలి తమిళనాడు లో సెటిల్ ఐయ్యారు ఎస్పీ బాలు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా.. అక్కడికె వస్తున్నాం…

నెల్లూరు నగరంలోని తిప్పారాజు వారి వీధిలో ఎస్పీ బాలుకి సొంత ఇల్లు ఉండేది. పేరుకు ఎస్పీ బాలు చెన్నై లో సెటిల్ అయినప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు నగరంలోని తిప్పరాజు వీధిలో సొంత ఇంట్లోనే వుండేవారు.. అయితే గత కొన్నేళ్ల క్రితం ఎస్పీ బాలు తల్లిదండ్రులు కాలం చేయడంతో ఆ ఇంటిని సంగీత పాఠశాలకు ఇచ్చేందుకు 2020 లో ఎస్పీ బాలు నిర్ణయం తీసుకున్నారు.. కోటి రూపాయలు పైగా విలువైన ఇళ్ళు వేద పాఠశాలకు ఇచ్చేందుకు ఎస్పీ ముందుకు రావడం అలాగే కంచి పీఠాధిపతులు సూచించిన విధంగా పది లక్షలు ఖర్చు చేసి ఎస్పీ బాలు ఆ ఇంటిని రి మోడల్ చేసి మరీ సిద్ధం చేశారు.

రీ మోడల్ చేసిన అనంతరం 2020 లో ఆ ఇంటిని కంచి పీఠాధిపతికి అందజేశారు ఎస్పీ బాలు.. అయితే కాలక్రమేణా కోవిడ్ తో ఎస్పీ బాలు కాలం చేయడంతో కంచి పీఠం నిర్వాహకులు ఆ ఇంటిని ఉపయోగించుకోవడంలో విఫలం అయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో, ‘వేద-నాద’ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఈ ఇంటిని ఉపయోగిస్తామని కంచి పీఠం అధిపతి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఐదేళ్లు గడిచిపోయాయి, వాగ్దానం చేసిన కార్యక్రమాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దివంగత గాయకుడి అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేశారు. ఒకప్పుడు చైతన్యవంతమైన ఇల్లు ఇప్పుడు చీకటిలో ఉందని, ఎటువంటి కార్యకలాపాలు లేదా ప్రాథమిక నిర్వహణ లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన కంచి పీఠం నెల్లూరు శాఖ నిర్వాహకుడు నందకిషోర్, తాము మొదట పది మంది విద్యార్థులతో విరాళంగా ఇచ్చిన నివాసంలో వేద పాఠశాలను ప్రారంభించామని అయితే, సరిపోని సౌకర్యాల కారణంగా, ముఖ్యంగా విద్యార్థులు బస చేసిన టెర్రస్పై తాత్కాలిక షెడ్ యొక్క అననుకూల పరిస్థితుల కారణంగా వారు సవాళ్లను ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. ఫలితంగా, విద్యార్థులను మరొక పాఠశాలకు మార్చవలసి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించబడలేదు. భవిష్యత్తులో ఇంటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.